AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గుంటూరు GGH హాస్పిటల్ లో భోజనశాల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు…

1 min read

AABNEWS :గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి రోగుల సహాయకుల కు ఉచిత భోజన సదుపాయాన్ని మే మూడో తేదీన ప్రాంరంభించాలని ముహూర్తం ఖరారు చేశారు.జిజిహెచ్ లో జరుగుతున్న భోజన శాల ముగింపు నిర్మాణ పనులను మంగళవారం జిల్లా ఇంచార్జి మంత్రి ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధ రాజు పరిశీలించారు.ఒకేసారి 300 మంది భోజనం చేసేందుకు ఏవిధంగా ఏర్పాట్లు చేయవచ్చన్నది ఆయన దగ్గరుండి చూసారు.నాణ్యత విషయంలో ఎక్కడ రాజీపడకుండా ఏర్పాట్లు పూర్తి చేయడం పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.మొత్తం 25 డైనింగ్ టేబుల్స్ ను ఏర్పాటు చేయాలని అందులో గ్రౌండ్ ఫ్లోర్ లో 12 టేబుల్స్..మొదటి ఫ్లోర్ లో 13 టేబుల్స్ ఏర్పాటు.చేయాలని అధికారులను ఆదేశించారు.రోగుల సహాయకులు సంతృప్తి గా భోజనం చేసి విధంగా ఏరాట్లు చేయాలని సూచించారు. మంచినీరు, డ్రైనేజీ సిస్టం ల గురించి ఆరా తీశారు. వాటిని పరిశుభ్రంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతి, సివిల్ సర్జన్ ఆర్ యం ఓ డాక్టర్ సతీష్ కుమార్, గృహ నిర్మాణ శాఖ పిడి వేణుగోపాల్ రావు, రెడ్ క్రాస్ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్ర రాజు పాల్గొన్నారు.

 590 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.