AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మూడేళ్ల చిన్నారి సజీవ దహనం…

1 min read

AABNEWS : తండ్రితో పొలం వెళ్లిన కూతురు కారులో ఆడుకుంటుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారులోనే ఉన్న చిన్నారి మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచింది. ఈ ఘటన క్రోసూరు మండలం బయ్యవరంలో జరిగింది. గ్రామానికి చెందిన కడియం మణికంఠ తన మూడేళ్ల కూతురు శ్రీనిధిని బొలెరో ట్రక్కు వాహనంలో ఎక్కించుకుని పొలం తీసుకెళ్లాడు. చిన్నారిని వాహనంలోనే కూర్చోబెట్టి తండ్రి వరిపొలంలో పంట నూర్పిడి పనులు చేసుకుంటున్నాడు. హఠాత్తుగా కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. వాహనంలోనే ఆడుకుంటున్న చిన్నారి తీవ్రగాయాలపాలవడంతో వెంటనే ఆమెను గుంటూరు జిజిహెచ్‌కు తరలించారు. అప్పటికే శరీరం పూర్తిగా కాలిపోవడంతో ఆ చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

 117 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.