AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లారీలో వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద ఉన్న సంచీలో ఏముందో చూసి నివ్వెరపోయిన పోలీసులు…

1 min read

AABNEWS : ఓ వ్యక్తి. సులభంగా డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకున్నాడు. నక్సలైట్ ను అంటూ పలువురిని భయపెట్లి లక్షలకు లక్షలు వసూలు చేశాడు. అదే క్రమంలో ఓ మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఆమె కోసం భారీగా డబ్బును కూడగట్టాలనుకున్నాడు. తన రూటు మార్చి ఓ డబ్బున్న వ్యక్తిని ఏమార్చాలనుకున్నాడు. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తిని చంపి, అతడి చేతిని నరికి ఓ డబ్బున్న వ్యక్తి ఇంట్లో పడేయాలన్నది అతడి ప్లాన్. ఆ తర్వాత ఆ డబ్బున్న వ్యక్తిని బెదిరించి కనీసం కోటి రూపాయలు అయినా డిమాండ్ చేయాలన్నది అతడి ఆలోచన. అనుకున్నట్టుగానే ఊరు పేరూ తెలియని ఓ వ్యక్తిని చంపేశాడు. చేతిని నరికి ఓ కవర్లో పెట్టుకుని వస్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం పుచ్చకాయలపల్లి గ్రామానికి చెంది సట్టి గాలెయ్య అనే వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. అక్రమాలకు పాల్పడుతూ అందరినీ బెదిరిస్తూ డబ్బులు వసూలుచేసేవాడు. గుర్తు తెలియని ప్రాంతాలకు వెళ్లి తాను నక్సలైటును అంటూ చెప్పుకుని డబ్బులు వసూలు చేసేవాడు. అలా లక్షలకు లక్షలు వసూలు చేశాడు. కొంత కాలం నుంచి భూలక్ష్మి అనే మహిళతో అతడికి వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె కోసం భారీగా డబ్బు కూడగట్టాలనుకున్నాడు. గతంలో చేసిన విధంగా కాకుండా ఈసారి ఏకంగా ఓ మనిషినే లేపేయాలని ఫిక్సయ్యాడు. ఎవరినైనా చంపి, చేయిని నరికి డబ్బున్న వాళ్ల ఇళ్లలో పడేయాలన్నది అతడి ప్లాన్. అలా పడేసిన తర్వాత పోలీసుల రూపంలో వెళ్లి బెదిరించి భయపెట్టి కోట్లకు కోట్లు కొట్టేయాలని మాస్టర్ ప్లాన్ వేశాడు.అనుకున్నట్టుగానే గుంటూరు జిల్లా నరసరావు పేట బస్టాండ్ వద్ద మద్యం షాపులో మిండ్యాల చినమారయ్య అలియాలస్ చినమారాజు అనే 24 ఏళ్ల కుర్రాడితో గాలెయ్య పరిచయం చేసుకున్నాడు. అతడితో కొద్ది సేపు మాట్లాడిన స్నేహితులందరం కలిసి పార్టీ చేసుకుంటున్నామనీ, అక్కడయితే మద్యంతోపాటు ఫుల్లుగా బిర్యానీ కూడా ఉందని చెప్పి నమ్మించాడు. మార్చి 30వ తారీఖున అతడిని పెదకాకాని మండలం తక్కెళ్లపాడు సమీపంలోని రామచంద్రపాలెం ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ పొలాల్లోకి తీసుకెళ్లి ఇద్దరూ కలిసి మద్యం తాగారు. స్నేహితులు దారిలో ఉన్నారంటూ అతడిని మాటల్లో పెట్టాడు. మారయ్య పూర్తిగా మద్యం మత్తులోకి వెళ్లడం చూసి అక్కడ ఉన్న రాయితో తలపై మోది చంపేశాడు.ఆ తర్వాత తనతోపాటు తెచ్చుకున్న కత్తితో మారయ్య ఎడమ చేయిని నరికి తన సంచీలో పెట్టుకున్నాడు. శవాన్ని పక్కనే ఉన్న మొక్కజొన్న పొలాల్లోకి లాక్కెళ్లాడు. బయటకు కనిపించకుండా లోపలికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత రోడ్డు మీదకు వచ్చాడు. నరికిన చేయి ఉన్న సంచీని తీసుకుని మానస సరోవరం వద్ద ఓ లారీని ఎక్కాడు. అయితే సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు లారీలను తనిఖీలు చేస్తున్నారు. అతడు ఎక్కిన లారీని కూడా చెకింగ్ వద్ద పోలీసులు ఆపారు. గాలెయ్య ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో అతడిని చెక్ చేశారు. అతడి వద్ద ఉన్న సంచీలో ఏముందో చూసి నివ్వెరపోయారు. నరికిన చేయి ఉన్న సంచీని చూసి షాకయ్యారు. అతడిని అదుపులోకి తీసుకుని వివరాలు రాబట్టారు. మొత్తానికి గాలయ్యను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనకు సంబంధించి మంగళవారం పోలీసులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

 319 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.