గూడూరు రైల్వే జంక్షన్ సమస్యలు పరిష్కరించాలి సీపీఐ,ఏఐవైఎఫ్,ఇన్సాఫ్,ఈద్గాహ్ కమిటీల డిమాండ్
1 min read
AABNEWS : గూడూరు రైల్వే జంక్షన్ సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఏఐవైఎఫ్ ఇన్సాఫ్ ఈద్గాహ్ యూత్ ల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గూడూరు రైల్వేస్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఐ పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా మాట్లాడుతూ గూడూరు రైల్వే జంక్షన్ కు సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా విచ్చేసిన విషయం తెలుసుకుని రైల్వే జంక్షన్ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నోచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరేందుకు వచ్చామన్నారు. అయితే జీఎం గూడూరులో కార్యక్రమం స్టేషన్ మాస్టర్ చెప్పడంతో సమస్యలతో కూడిన లేఖను జీఎంకు పోస్ట్ ద్వారా పంపించనున్నట్లు తెలిపారు. గూడూరు రైల్వే జంక్షన్ లో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయన్నారు. ప్రధానంగా మెమో రైళ్లను పునరుద్ధరించాలన్నారు. చెన్నై నుండి సూళ్లూరుపేట వరకూ మెమో రైళ్లు నడుస్తున్నాయన్నారు. స్కూళ్లు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు వంద శాతం పునః ప్రారంభం కావడంతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు బస్సులలో అధిక డబ్బులు చెల్లించి రాకపోకలు సాగించలేకున్నారన్నారు. వెంటనే మెమో రైళ్లను పునః ప్రారంభించాలని కోరారు. ఏఐటీయూసీ నాయకులు ఎంబేటి చంద్రయ్య మాట్లాడుతూ రైల్వే జంక్షన్ లో ఉచిత మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రయాణీకులకు సురక్షిత నీరు అందించాలని కోరారు. ఇన్సాఫ్ కమిటీ గూడూరు డివిజన్ గౌరవ సలహాదారులు ఎండీ. అన్వర్ బాష మాట్లాడుతూ గూడూరు రైల్వే జంక్షన్ ఉత్తర వైపున ఫ్లాట్ ఫాంలపై మరుగుదొడ్లను నిర్మించాలన్నారు. నూతనంగా 4, 5 ఫ్లాట్ ఫాంలు నిర్మించడంతో ఉత్తరం వైపు యుద్ధప్రాతిపదికన మరుగుదొడ్లను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ సునీల్ యాదాల మాట్లాడుతూ గూడూరు రైల్వే జంక్షన్ కు సంబంధించి వివేకానంద రోడ్డుపై నిరుపయోగంగా ఉన్న రైల్వే స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ ను నిర్మిస్తే నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుందన్నారు. అలాగే గదులు నిర్మించి అద్దెకిస్తే రైల్వేశాఖకు ఆదాయం చేకూరుతుందన్నారు. ఈద్గాహ్ యువత నాయకులు షేక్ హాషిం మాట్లాడుతూ బొగ్గుల దిబ్బ, రైల్వే క్వార్టర్స్ వీధులలో ఏళ్ల తరబడి శిథిలమై ఉన్న రైల్వేశాఖ ఇళ్లను తొలగించాలన్నారు. గూడూరు రైల్వే జంక్షన్ కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ర్టాలకు వెళ్లే ప్రయాణీకులకు కేంద్రంగా ఉందన్నారు. రైల్వే ప్రయాణీకులకు మెరుగైన వసతులు కల్పించాల్సిన బాధ్యత రైల్వే శాఖపై ఉందన్నారు. రైల్వే స్టేషన్ లో కానీ, స్టేషన్ ప్రాంగణంలోకానీ మెడికల్ షాప్ ఏర్పాటు చేయాలన్నారు. ఏపీఎండబ్ల్యూఓ మీడియా సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జమాలుల్లా మాట్లాడుతూ కరోనాలో ప్రారంభించిన పార్శిల్ రైల్ సర్వీసులను క్రమ బద్దీకరించాలన్నారు. తిరుపతి-రేణిగుంటల మీదుగా గూడూరు వైపుగా వెళ్లే కిసాన్ స్పెషల్ రైళ్లలో రెండు భోగీలు గూడూరు జంక్షన్ కు కేటాయించాలన్నారు. ఇన్సాఫ్ కమిటీ గూడూరు డివిజన్ కోశాధికారి షేక్. కబీర్ మాట్లాడుతూ రైల్వే జంక్షన్ లో ప్రయాణీకులు, ప్రజల సౌకర్యార్థం ఉత్తర, దక్షిణ క్యాబిన్ల వద్ద ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా డిమాండ్లతో కూడిన లేఖను ఆ మేరకు సికింద్రాబాద్ రైల్వే జీఎం కార్యాలయానికి పోస్ట్ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎంబేటి చంద్రయ్య, ఏపీఎండబ్ల్యూఓ రాష్ట్ర మీడియా సెల్ ప్రధాన కార్యదర్శి షేక్. జమాలుల్లా, ఇన్సాఫ్ నాయకులు ఎండీ. అన్వర్ బాష, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ సునీల్ యాదాల, ఇన్సాఫ్ కమిటీ డివిజన్ కోశాధికారి షేక్. కబీర్, ఈద్గాహ్ యూత్ సభ్యులు షేక్. హాషిం తదితరులు పాల్గొన్నారు.
626 Total Views, 2 Views Today