September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గూడూరు లోని పరిశుద్ధ పౌలుపేతురు లూథరన్ చర్చికి సంబంధించిన నాలుగు కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆ సంఘ మాజీ ట్రెజరర్ మట్టం దేవ ప్రసాద్ ఆరోపించారు…

1 min read

AABNEWS : గూడూరు లోని పరిశుద్ధ పౌలుపేతురు లూథరన్ చర్చికి సంబంధించిన నాలుగు కోట్ల నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆ సంఘ మాజీ ట్రెజరర్ మట్టం దేవ ప్రసాద్ ఆరోపించారు. 14 ఏళ్లుగా బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా ధన, రాజకీయ బలంతో అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై కేసులు, భౌతిక దాడులు చేస్తున్నారని ఆరోపించారు. గూడూరు లోని చర్చి కాంపౌండ్ లో ఉన్న తన నివాసంలో పరిశుద్ధపౌలు పేతురు లూధరన్ చర్చ్ మాజీ కోశాధికారి దేవ ప్రసాద్, అనిల్ కుమార్ సాల్మాన్, డిజె సుందరం లతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన చర్చి నిధులు, ఆస్తులకు సంబంధించి పలు ఆరోపణలు చేశారు. చర్చిలో పాస్టర్ మనోహరం, ట్రెజరర్ నిర్మల కలిసి అనేక అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. ఈ మేరకు అధికారులకు వినతి పత్రాలు సమర్పించినట్లు గుర్తుచేశారు. ప్రశ్నించిన వారి సభ్యత్వం రద్దు చేయడం, బెదిరించడం పరిపాటిగా మారిందని తెలిపారు. తాజాగా కూరగాయల మార్కెట్ ను ఎస్ ఎం జి స్కూల్ ఆవరణలో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఏర్పాటు చేశారని ఆరోపించారు. క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారని చెప్పారు. తాము ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న మార్గాన్ని కూడా అక్రమాలను ప్రశ్నించామన్న ఒక్క కారణంతోనే మూసివేయాలని ప్రయత్నిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఓవైపు మీడియా సమావేశం జరుగుతుండగా ఎస్.ఎస్.ఎల్.సి నాయకుడు బత్తిన విజయ్ కుమార్ మరి కొందరితో కలిసి అక్కడకు వచ్చారు. దారికి అడ్డుగా ఉన్న ఇటుకలను తొలగించేందుకు దేవప్రసాద్ ప్రయత్నించిన సమయంలో స్వల్ప తోపులాట జరిగింది. అయితే చర్చి స్థలాన్ని ఆక్రమించుకున్నారని, అందుకే ఆక్రమణలు తొలగించేందుకు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్ఏఎల్ సి సెక్రెటరీ నిర్మలమ్మ తెలిపారు.
గూడూరు లోని చర్చి కాంపౌండ్ లో దేవ ప్రసాద్ తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశం అనంతరం బయటకు వచ్చి తన ఇంటి మార్గంలో ఉన్న ఇటుకలను తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న ఎస్.ఏ.ఎల్.సి నాయకుడు బత్తిని విజయ్ కుమార్ ఇటుకలను పక్కకు వేయడం తప్పు పట్టారు. చర్చి స్థలాన్ని ఆక్రమించుకున్నారని పోలీసు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు వచ్చారు. ఇరు వర్గాలకు సర్ది చెప్పి వెళ్లారు. అనంతరం అక్కడే ఎస్.ఎ. ఎల్.సి సెక్రటరీ నిర్మలమ్మ మీడియాతో మాట్లాడారు. చర్చి స్థలం ఆక్రమణలకు గురైందని , సర్వే జరిపి నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. పాస్టర్ మనోహరం కూడా మాట్లాడారు. చర్చి కాంపౌండ్ గోడ పగలగొట్టి మరి నిబంధనలు వ్యతిరేకించినట్లు వివరించారు.

 1,789 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.