అఖిల భారత యువజన సమాఖ్య డిమాండ్…
1 min read
AAB NEWS :
జన సేనాని రైతు బిల్లులను వ్యతిరేకించాలి..
అఖిల భారత యువజన సమాఖ్య డిమాండ్
3జీడీఆర్1 – మాట్లాడుతున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు సునీల్ యాదాల
గూడూరు : నివార్ తుపాన్ తో జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారని పరామర్శించేందుకు వస్తున్న జన సేనాని తొలుత రైతు బిల్లులను వెనక్కు తీసుకోవాలని కేంద్రానికి ఒప్పించాలని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా నాయకులు సునీల్ యాదాల అన్నారు. గురువారం స్థానిక కటకరాజావీధిలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా రైతు బిల్లులపై రైతన్నలు రోడ్లపైకి వచ్చి నిరసనలు, రిలే దీక్షలు చేపడుతున్నారని తెలిపారు. అయితే రాష్ట్రంలో అధికా పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ ఈ విషయంలో స్పందిచక పోవడం దారుణమన్నారు. గూడూరు డివిజన్ లో పర్యటన రాజకీయ స్వార్థం కోసం, ఎంపీ ఎన్నికల స్టంట్ గా భావించాల్సి వస్తోందన్నారు. బీజేపీతో జతకట్టిన పవన్ కల్యాణ్ కు నిజంగా రైతులపై ప్రేమ, చిత్తశుద్ధి ఉంటే వెంటనే రైతు వ్యతిరేక బిల్లులు, చట్టాలపై కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వంశీ, వెంకటేష్, బాలాజీ, కృష్ణ, వెంకట్ సాయి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
28 Total Views, 2 Views Today