అధికారులు సమస్య గమనించండి…
1 min read
AAB NEWS : గూడూరు ముఖ ద్వారం చిల్లకూరు బైపాస్ సర్కిల్ వద్ద నుండి పట్టణంలో సంగం సినిమా థియేటర్ వరకు ప్రపంచ బ్యాంకు నిధులతో సిమెంట్ రోడ్డు వేశారు,ఈ రోడ్డును ప్రపంచ బ్యాంకు నిధులతో కొన్ని కోట్ల రూపాయలతో వేశారు, ఎంతో నాసిరకంగా వేసిన ఈ రోడ్డు ఎప్పుడో బీటలు వారి రోడ్డు దెబ్బతిని సిమెంటు పోయి కేవలం కంకర రోడ్డు లాగా తయారైంది,ఇప్పుడు దానికి తోడు వాహన దారులకు నీటి రూపంలో కొత్త కష్టాలు వచ్చాయి,ఈ రెండు లైన్ల రోడ్డు ఉత్తరం వైపు మొత్తం ఆక్రమణలు గురై పోయి వాన నీరు వేళ్ళు మార్గాలు మూసుకు పోగా దక్షిణం వైపు చెరువు కట్ట మట్టి రోడ్డుమీద చేరడంతో రోడ్డు నునుపుగా మారి ఎంతో ప్రమాదకరంగాను నీరు వెళ్ళే మార్గం లేకుండాను ఉండి సిమెంటురోడ్డు ఉత్తరం వైపు వాలుగా ఉండి వర్షపు నీరు బయట వెళ్ళే అవకాశమే లేకుండా రోడ్డు మీదే నీరు ఉండిపోవడంతో వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు,
గూడూరు పట్టణ ప్రజలకు, వాహనదారులకు ఏంతో సౌకర్యంగా ఉండడానికి సుమారు నలభై కోట్లకు పైగా ప్రపంచ బ్యాంకు నిధులతో వేసిన ఈ సిమెంటు రోడ్డు వాననీరు బయట వెళ్లే మార్గం లేక రోడ్డుమీద చెరువును తలపిస్తుంది ఇప్పటికైనా అధికారులు వాన నీరు వేళ్ళు మార్గం ఏర్పాటు చేసి వాహనదారులును రక్షించాలని ప్రజలు కోరుతున్నారు..
36 Total Views, 2 Views Today