September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

అమ్మవడి రెండో విడత ప్రారంభం…

1 min read

AABNEWS : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నెల్లూరు లో అమ్మవడి రెండో విడత ప్రారంభం సభలో పాల్గున్తున్న సందర్భంగా రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాలు మేరకు గూడూరు పట్టణానికి చెందిన చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాండ్ల సురేష్ బాబు నేతృత్వంలో గూడూరు నుండి నెల్లూరులో జరిగే సీఎం సభకు భారీగా అభిమానులు తరలి వెళ్లారు ముందుగా వైసీపీ నాయకులు, చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల.సురేష్ బాబు ,గుండాల.ఆదినారాయణ , మండ్ల.రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో మాలవ్యానగర్ మహాలక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు జై జగన్ నినాదాలతో హోరెత్తిస్తూ సుమారు రెండు వేల మంది వంద వాహనాలలో భారీ ర్యాలీగా సీఎం సభకు చేరుకున్న చేగువేరా పైలట్ టీమ్ సభ్యులు , ఈద్గా యూత్ , అంబేద్కర్ యూత్ ,వైసీపీ కార్మిక విభాగం మహిళలు , అభిమానులు, కార్యకర్తలు… ఈ సందర్భంగా మాండ్ల సురేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న అమ్మఒడి రెండో విడత పథకాన్ని నెల్లూరులో వేణుగోపాలస్వామి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు అని ఆయన తెలిపారు, వైకాపా మంత్రులు , ఎమ్మెల్యేలు , అధికారులు సభను విజయవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు అని అందులో భాగంగానే. తొలిసారిగా సీఎం జగన్ నెల్లూరు నగరానికి విచేస్తుండడంతో జిల్లాకు చెందిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని విజయ వంతం చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు అని వెల్లడించారు. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు అత్యంత సన్నిహితులైన గూడూరు పట్టణానికి చెందిన వైసీపీ నాయకులు , చేగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ్ల.సురేష్ బాబు , చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల.ఆదినారాయణ , వైసీపీ కార్మిక విభాగం నాయకులు మండ్ల.రాజేష్ కుమార్ తదితరుల ఆధ్వర్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు గూడూరు నుండి వందలాదిగా వైసీపీ యువజన విభాగం , కార్మిక విభాగం , కార్యకర్తలు , అభిమానులు , చేగువేరా పైలట్ టీమ్ సభ్యులు , సీఎం సభను జయప్రదం చేసేందుకు తరలివెళ్లారు. గూడూరు పట్టణ మరియు అయ్యవారిపాలెం , మేగనూరు , విందూరు , పురిటి పాలెం,కుందకూరు , వేములపాలెం , వెడిచెర్ల , చింతవరం , పురిటిపాలెం , కట్టువపల్లి , రాపూరు , చాగణం పలు ప్రాంతాల నుండి కార్లు , టెంపోలలో సుమారు వంద వాహనాలలో 1500 మంది యువత , 500 మంది మహిళలు రెండు వేల మంది వరకు సీఎం సభకు తరలివెళ్లారు. తొలుత గూడూరు రెండో పట్టణ పరిధిలోని మాలవ్యానగర్ లో శ్రీ మహాలక్ష్మమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అని తెలిపారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రపంచంలో ఉన్న రాజకీయ నాయకులలో అత్యంత ఓర్పు , సహనం , మంచితనం మనసున్న రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క సీఎం జగన్ మాత్రమే అని పేర్కొన్నారు. మాట తప్పని , మడమ తిప్పని గొప్ప నేత అని ,పాదయాత్రలో ప్రజలకిచ్చిన హామీలే కాకుండా ఇంకా ఎక్కువగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్ర ప్రజల నీరాజనాలు పొందుతున్నారని , మన దేశంలోని పలు రాష్ట్రాలు సైతం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనను కీర్తిస్తున్నాయని కొనియాడారు. అనంతరం గూడూరు నుండి జై జగన్ అంటూ నినాదాలతో హోరెత్తిస్తూ నెల్లూరులో జరగనున్న సీఎం సభకు భారీ ర్యాలీగా తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రమేష్ యాదవ్,కిరణ్‌( మేగనూరు ) , షబ్బీర్ , (ఈద్గా యూత్‌ ), సురేష్‌ ( అంబేద్కర్ యూత్ ),సోమరాజు( కుందకూరు ) , ప్రశాంత్ , హరి (అయ్యవారి పాళెం) మణికంఠ(చింతవరం) శాంతి , హసీనా,మమోలమ్మ (కార్మిక విభాగం) చేగువేరా పైలట్ టీమ్ సభ్యులు క్రాంతికుమార్‌,వినయ్ , లక్ష్మీనారాయణ , అజయ్ , శ్రీను , మణికంఠ , కిరణ్ , సుమన్ , శ్రీకాంత్‌,ఇంకా భారీ సంఖ్యలో అభిమానులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

 210 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.