AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం…

1 min read

AABNEWS : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్(CIBA) వారు ఉప్పు నీటి ఆక్వా రైతుల కోసం గూడూరు లో రైతులతో సమావేశం గూడూరు డివిజన్ లో ఆక్వా రైతులకు ఎటువంటి సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో వుంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం..గూడూరు ఫిషరీస్ AD.చాంద్ బాషా ప్రపంచ మట్టి ఆక్వా దినోత్సవం సందర్భంగా మారుతున్న వాతావరణ పరిస్థితులు,ఉప్పు నీటి మార్పులు వల్ల వచ్చే సమస్యలు పరిష్కారాల కోసం ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం గూడూరు లో నిర్వహించారు. ప్రపంచంలో రొయ్యల ఉత్పత్తిలో భారతదేశం 8 లక్షల టన్నులతో అగ్రగామిగా ఉందని ఈ ఉత్పత్తిలో 5లక్షల టన్నులకు పైగా రొయ్యలు ఉత్పత్తి చేస్తూ ఆంద్రప్రదేశ్ రొయ్యల సాగులో ప్రధమ స్థానంలో ఉందని ఇంత పెద్ద రొయ్యల మార్కెట్ లో వాతావరణ మార్పుల వలన ఎన్నో కొత్త సమస్యలు వస్తూ రైతాంగం తీవ్ర ఇబ్బందులుకు లోనవుతుందని ఇలాంటి సమస్యలు పరిష్కారం కోసం శాస్త్ర వేత్తలు నిరంతరం కృషిచేస్తున్నారని సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలియ చేశారు..ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు J.అశోక్ కుమార్…DR.M.మురళీదర్…శ్రీమతి ఆర్.అనుపమ.dr. ఎం.పూర్ణిమ..గూడూరు ఫిషరీస్ A.D చాంద్ బాషా గూడూరు డివిజన్ ఆక్వా రైతులు పాల్గొన్నారు

 142 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.