AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు గారు. వార్డు లోని స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గారు…

1 min read

AABNEWS : గూడూరు రెండోవ పట్టణం 31 వ వార్డు చింపిరి నాయుడు పేట మరియు చింపిరి నాయుడు కాలువ కట్ట లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు గారు. వార్డు లోని స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే గారు 31వ వార్డులో పలుచోట్ల డ్రైన్స్ మరియు సిసి రోడ్లు సరిగా లేవని స్థానిక మహిళలు తెలుపుతూ పలువురికి త్రాగునీరు రావడం లేదు అని ఎమ్మెల్యే గారికి వారి సమస్యలను తెలిపారు. వార్డులో అంగవైకల్యంతో అనారోగ్యంగా ఉన్న ఓ వికలాంగుడు తన ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని ప్రభుత్వం ద్వారా సహాయం కోరగా వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి లేఖ వ్రాసి ఇచ్చిన గౌరవ శాసన సభ్యులు. వార్డు లోని సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే గారు తక్షణమే సమస్యల పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడారు.31వ వార్డులోని స్థానిక ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ రావు గారు.వార్డు లో ఏ సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని వాలెంటిర్లతో ఎమ్మెల్యే గారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపి పార్టీ సీనియర్ నాయకులు బత్తిన విజయ్ కుమార్ మరియు పట్టణ అధ్యక్షులు బొమిడి శ్రీనివాసులు, చోళ్ళ వరం గిరి బాబు, ముస్లిం మైనారిటీ నాయకులు మగ్ధుమ్ బాయ్,అన్నం మురళి, మనోహర్, కాలేష, బాబు, సురేష్ యాదవ్, కృష్ణ మరియు స్థానికులు పాల్గొన్నారు.

 1,277 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.