AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఎస్పీ గారి ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు సీఐ శ్రీనివాసులు రెడ్డి గారూ…వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో…

1 min read

AABNEWS :ఎస్పీ గారి ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు సీఐ శ్రీనివాసులు రెడ్డి గారూ…వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు సౌకర్యార్ధం నెల్లూరు జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాల మేరకు గూడూరు రూరల్ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో చిల్లకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాబీ సహాయ సహకారాలతో చిల్లకూరు పోలీస్ స్టేషన్ ముందు మజ్జిగ మరియు మంచి నీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది.గూడూరు రూరల్ సర్కిల్ ఇనస్పెక్టర్ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్టిలో ఉంచుకొని ప్రజల కొరకు ఎస్పీ ఆదేశాల మేరకు చిల్లకూరు పోలీస్ స్టేషన్ ముందు మజ్జిగ మరియు మంచి నీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం దీనికి సహాయ సహకారం అందించిన మాజీ టీవీ 9 విలేకరి కీ”శే”మోడిబోయిన.గోపినాధ్ జయంతి సందర్బంగా వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.దీనిని ప్రజలు మరియు ప్రయాణికులు సద్వినియోగం చేసుకొగలరు అని సిఐ శ్రీనివాసులు రెడ్డి తెలియజేసారు.ఈ కార్యక్రమంలో స్టేషన్ సబ్ ఇనస్పెక్టర్ బాబీ,నాగూరయ్య,విష్ణు,పోలీస్ సిబ్బంది,గోపినాధ్ కుమార్తె సాయి,అల్లుడు నరేష్ కుటుంబ సభ్యులు గోపినాధ్ ప్రియ మిత్రుడు బాబు మోహన్ దాస్,రసూల్,
విలేకరులు పాల్గొన్నారు.

 2,998 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.