AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

కార్మికులు వ్యతిరేకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…

1 min read

AAB NEWS : కార్మిక వ్యతిరేకి నరేంద్ర మోదీ సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదగిరి హాజరైన అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, సీపీఎం, అనుబంధ సంఘాల నాయకులు వార్త✍️మీజూరు మల్లి✍️ : కార్మిక వ్యతిరేకి ప్రధాని మోదీ అని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లూరు యాదగిరి అన్నారు. గురువారం గూడూరు పట్టణంలోని మాయాబజార్ లో ఉన్న సీపీఎం కార్యాలయంలో సార్వత్రిక సమ్మెకు సంఘీభావంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్రంలో రెండోసారి ఆధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం కార్మిక చట్టాలను హరించే దిశగా చర్యలు తీసుకుంటోందన్నారు. ఏళ్ల తరబడి ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. కార్పొరేట్ కు ఎర్ర తివాచీ పరుస్తూ, ప్రశ్నించేవారిని జైళ్లపాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. నూతనంగా రైతు చట్టాలు రూపొందించారని, ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోయినా ప్రశ్నించే వీలు లేకుండా చేశా‌రని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎం పట్టణ కార్యదర్శి పామంజి మణి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, నల్ల ధనాన్ని రాబట్టి దేశ ప్రజల ఖాతాలలో 15 లక్షల రూపాయల వంతున జమ చేస్తానని చెప్పి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారన్నారు. తీరా అధికారంలోకి వచ్చి కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారన్నారు. దేశ వ్యాప్తంగా బీజెపీయేతర పార్టీలన్నీ ఐక్యమై హక్కుల సాధన కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జోగి శివకుమార్ మాట్లాడుతూ ఆదాయవనరులైన రైల్వే, విమానం‌, ఎల్ఐసీ తదితర అనేక సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేశారని కేంద్ర పాలకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పుట్టా శంకరయ్య, మధు, అంగన్ వాడీ నాయకులు హెబ్సిబా, ప్రభావతి, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు ఉషా, ఆటో యూనియన్ నాయకులు శ్రీనివాసులు, బీవీ. రమణయ్య, సీపీఎం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

 98 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.