కోట పట్టణంలో వెజ్- నాన్ వెజ్ మార్కెట్లు కొరకు 2 కోట్ల రూపాయలు నిధులు కోరిన వినోద్ రెడ్డి…
1 min read
AABNEWS : కోట పట్టణంలో వెజ్- నాన్ వెజ్ మార్కెట్లు నిర్మాణం కొరకు సీఎం ను 2 కోట్ల రూపాయలు నిధులు కోరిన వినోద్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి పుష్పా గుచ్ఛం అందించిన వినోద్ రెడ్డి వెజ్- నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం సీఎం జగన్ కు వినతిపత్రం అందజేసిన వినోద్ రెడ్డి వినోద్ రెడ్డి యోగక్షేమాలు అడిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి నిధులు తప్పకుండా మంజూరు చేస్తా సీఎం హామీ పాత కోట మండల పరిషత్ కార్యాలయం వద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు సీఎం ను నిధులు కోరిన వినోద్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన వినోద్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరులోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న వేణు గోపాల్ స్వామి ఆలయ ప్రాంగణంలో నవరత్నాల హామీల్లో అత్యంత కీలకమైన ‘జగనన్న అమ్మ ఒడి’ రెండో ఏడాది చెల్లింపులను ప్రారంభ కార్యక్రమంలో పాల్గునేందుకు సోమవారం రావడంతో ముందుగా నెల్లూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో హెలిఫ్యాడ్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జేసీ లు ,జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ మరియు వైసీపీ నేతల్లో ప్రముఖులు ఘన స్వాగతం పలికారు వీరు తో పాటు కోట పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి కూడా సీఎం కు స్వాగతం పలికి పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు, ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి వినోద్ రెడ్డి కోటలో పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని సీఎం కు వినతిపత్రం అందజేశారు,అందులో కోట పట్టణంలో ఎన్నో ఏళ్ళు నుండి ఎదురుచూస్తున్న వారి చిరకాల కల స్వర్గీయ నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు మిందా నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాన్ని కి కోటి రూపాయలు, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి మరో కోటి రూపాయలు, కోట పట్టణంలో పాత మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరుతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సీఎం ను కోరారు,వెంటనే స్పందించిన సీఎం క్యాంపు కార్యాలయం అధికారి సాల్మాన్ రాజ్ కు వినోద్ రెడ్డి ఇచ్చిన వినతిపత్రం ఇచ్చి నిధులు విడుదల చేయాలని ఆదేశించారు, అలాగే వినోద్ రెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న సీఎం” వెల్డన్ వినోద్ “అంటూ భుజాలు తట్టి ఆత్మీయతను చాటారు, దింతో ఖుషి అయిన వినోద్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఉన్న కూడా ఆయన చూపుతున్న అభిమానం ఆత్మీయతను మరువలేము అన్నారు,కోట పట్టణ అభివృద్ధి కోసం నిధులు కావాలి అని కోరిన వెంటనే సీఎం స్పందించిన తీరు అపూర్వం అన్నారు.త్వరలోనే కోటలో వెజ్- నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, పాత మండల పరిషత్ కార్యాలయం వద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టి కోటను అన్నీ విధాల అభివృద్ధి చేస్తాం అనీ వెల్లడించారు, ఈయన వెంట వైసీపీ మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి, షేక్ మొబిన్ బాషా, గాది భాస్కర్,వైసీపీ నేతలు తదితరులు ఉన్నారు.
48 Total Views, 2 Views Today