AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గూడూరులో భారత్ బంద్…

1 min read

AAB NEWS : గూడూరులో భారత్ బంద్ సక్సెస్…
పట్టణంలో భారీ ర్యాలీ…
మూతపడ్డ బ్యాంకులు, దుకాణాలు..
రైతు చట్టాలను రద్దుచేసేంత వరకూ పోరాటం…
జోరు వర్షంలోనూ రాస్తారోకో..
గూడూరు : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులిచ్చిన పిలుపుమేరకు గూడూరులో చేపట్టిన భారత్ బంద్ సక్సెస్ అయింది. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలతోపాటు ఆయా పార్టీల ఆనుబంధ సంఘాలు భారత్ బంద్ లో పాల్గొన్నాయి. తొలుత మాయాబజార్ లోని సీపీఎం కార్యాలయం నుండి ర్యాలీని ప్రారంభించారు. వివేకానంద రోడ్డుమీదుగా ముత్యాల పేట, రాజావీధి, సంగం థియేటర్, హాస్పిటల్ రోడ్డుల మీదుగా గడియారం స్థంభం వద్దకు చేరుకున్నారు. జోరుగా కురుస్తున్న భారీ వర్షంలోనే రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్. యాదగిరి, సీపీఐ నియోజక వర్గ కార్యదర్శి సీవీఆర్. కుమార్, పట్టణ కార్యదర్శి షేక్ కాలేషా, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ పరిమళ వెంకటేశ్వర్లు, బీఎస్పీ నాయకులు వీ. రఘు మాట్లాడారు. కేంద్రం వెంటనే రైతు చట్టాలను రద్దు చేయాలన్నారు. రైతు చట్టాలు రద్దుచేసేంతవరకూ పోరాటం ఆపేదిలేదన్నారు. కార్పొరేట్ కంపెనీలకు ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం కట్టబెట్టిందన్నారు. దేశానికి వెన్నముకగా ఉన్న రైతును నిర్వీర్యం చేసే చట్టాలను తీసుకొచ్చి బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేదిలేదన్నారు. బిజేపీయేతర పార్టీలన్నింటినీ కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఒక కోటి ముప్పై లక్షల మంది రైతులు దేశ చరిత్రలోనే ప్రథమంగా నిరసన కార్రక్రమాలను గత కొంత కాలంగా చలి, వర్షానికి జంకకుండా నిర్వహిస్తున్నారన్నారు. రైతన్నకు అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అన్నదాతలను ఇబ్బందులకు గురిచేసిన ఏ ప్రభుత్వానికైనా పుట్టగతులుండవన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఏ. కేశవులు, పామంజి మణి, ఎస్. ముత్యాలయ్య, సీఐటీయూ నాయకులు టీ. వెంకట్రామిరెడ్డి, ఆర్. శ్రీనివాసులు, కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి, సర్వేపల్లి నియోజకవర్గాల ఇన్ చార్ఝ్ లు పంటా శ్రీనివాసులు, పూల చంద్రశేఖర్, పట్టణాధ్యక్షులు శ్రీనివాసాచారి, బీఎస్పీ నాయకులు వేమయ్య, ప్రజా సంఘాల ఐక్య కార్యాచరణ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కేఆర్. దాసరి, ఏఐటీయూసీ నాయకులు ఎంబేటి చంద్రయ్య, నారాయణ, ఏఐవైఎఫ్ నాయకులు సునీల్ యాదాల, చల్లా వెంకటేశ్వర్లు, అన్వేష్, బాలాజీ, పీడీఎస్ యూ నాయకులు ఎం. సునీల్, ఇన్సాఫ్ కమిటీ నాయకులు ఎండీ. అన్వర్, షేక్. జమాలుల్లా, షేక్ కబీర్, సయ్యద్ జమీల్, ఎస్డీ. అఫ్జల్, షేక్ ఇబ్రహీం, వ్యవసాయ సంఘం నాయకులు జోగి శివకుమార్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పుట్టా శంకరయ్య, మధు, ఆటో యూనియన్ నాయకులు బీవీ. రమణయ్య, కేవీపీఎస్ నాయకులు అడపాల ప్రసాద్, బుడతాటి చంద్రయ్య ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 268 Total Views,  6 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.