AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఘనంగా ప్రారంభం అయిన జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్…

1 min read

AABNEWS : ఘనంగా ప్రారంభం అయిన స్వర్గీయ నల్లపరెడ్డి హారనాధ్ రెడ్డి మెమోరియల్ జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ షటిల్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే, గూడూరు డిఎస్పి టోర్నమెంట్ షీల్డ్ లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే, డిఎస్పి,వినోద్ రెడ్డి నల్లపరెడ్డి కుటుంబ పెద్దలు చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి నల్లపరెడ్డి హారనాధ్ రెడ్డి పేరున క్రీడలు నిర్వహించడం అభినందనీయం నల్లపరెడ్డి కుటుంబం వారసుడు వినోద్ రెడ్డి రాజకీయాల్లో రాణించాలి ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు మనిషి మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలే పునాది అని మనిషి బతకడానికి ఆహారాన్ని తీసుకుంటే.. శరీర పోషకాలుగా ఉపక రిస్తే.. అనునిత్యం ఆటలు, క్రీడల వల్ల ఆరోగ్య వంతుడౌతాడ నేది నిజం అని. క్రీడలు చిన్ననాటి నుంచి అలవడితే దేహా(దేశా)నికి మంచిది. ‘పెద్దలమాట చద్దిమూట’తో పోల్చారు. క్రీడలు, వ్యా యామాలు చిన్నలకు, యువకులకు, పెద్దలకు ఆరోగ్యాన్ని, ఆహ్లా దాన్ని, ఉల్లాసాన్ని, ‘ఆరోగ్యమే మహాభాగ్యపు చద్దిమూట’ ని స్తుంది కాదనగలరా! శ్వాసను సైతం లోకాల కోసం పీల్చే వృక్షా లున్నాయి. కోయిల పిల్లల కోసం తమ గూళ్లను పొత్తిళ్లుగా పరిచే కాకులున్నాయి. కానీ మనిషి ఆరోగ్యకరంగా, దృఢంగా, మానసి కంగా, శారీరకంగా ఉల్లాసవంతమైన జీవితానికి అత్యంత ప్రా ధాన్యత నిచ్చే క్రీడల పట్ల యువత శ్రద్ద చూపాలి అనీ గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు, గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు, శనివారం కోట పట్టణంలోనీ ఎన్ సి ఆర్ యువ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన తండ్రి స్వర్గీయ నల్లపరెడ్డి హారనాధ్ రెడ్డి మెమోరియల్ జిల్లా స్థాయి షటిల్ పోటీలు ప్రారంభోత్సవ కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టారు,ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు, గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి,వా కాడు సిఐ నరసింహ రావు, కోట మండలతహశీల్దార్ రమాదేవి,ఎంపిడిఓ భవాని,ఎస్సై బిబి మహేంద్ర నాయక్,వైసీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నల్లపరెడ్డి కుటుంబానికి ఎంతో పేరు ఉంది అనీ అలాంటి కుటుంబ వారసుడు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఎంతో కష్ట పడ్డారు అనీ ఆయన తెలిపారు, వినోద్ రెడ్డి ఎప్పుడూ కూడా కోట గ్రామ అభివృద్ధి కోసం నిధులు అడుగుతారు అనీ వినోద్ రెడ్డి కోరిక మేరకు కోట పట్టణంలో ప్రధాన సమస్య పంట కాలువ డ్రైన్ సమస్య అని అందుకోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సమస్యను పరిష్కరిస్తాం అని,అదేవిధంగా నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెజ్- నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, ఓల్డ్ ఎంపిడిఓ కార్యాలయం వద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం, కోట క్రాస్ రోడ్డు నుండి కోట గాంధీ బొమ్మ వరకు రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం చేపట్టి కోట ప్రజల చిరకాల కల నెరవేర్చుతాం అని వెల్లడించారు. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నల్లపరెడ్డి కుటుంబ చరిత్ర గురుంచి చిన్నతనం నుంచి విన్నాను అని కోట,వాకాడు రాజకీయాలకు నిలయంగా ఉన్నాయి అని పేర్కొన్నారు, నల్లపరెడ్డి కుటుంబానికి చెందిన హారనాధ్ రెడ్డి పేరునా జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గున్నడం చాలా సంతోషం గా ఉంది అన్నారు, ఎమ్మెల్యే వరప్రసాద్ రావు పోలీసు శాఖ ను గౌరవిస్తారు అని,ఎప్పుడూ కూడా పోలీసులపై ఒత్తిడి తెచ్చిన దాఖలు లేవు అన్నారు, యువత ఎమ్మెల్యే ను ఆదర్శంగా తీసుకోవాలని అనీ ఎందుకు అంటే 70 ఏళ్ల వయస్సులో కూడా ఆయన వ్యాయామం,వాకింగ్,యోగలు చేస్తూ ఎంతో ఆరోగ్యం గా ఉంటారు అన్నారు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి పేరు తో ప్రతీ ఏటా క్రీడా పోటీలు నిర్వహిస్తాం అనీ, అందులో భాగంగా 2021 నల్లపరెడ్డి హారనాధ్ రెడ్డి మెమోరియల్ జిల్లా స్థాయి షటిల్ టోర్నమెంట్ నిర్వహించాం అనీ, ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గున్న ఎమ్మెల్యే, డిఎస్పీ,సిఐ,తహశీల్దార్, ఎంపీడీఓ, ఎస్సై, వైసీపీ నేతలు ,ప్రముఖులు, క్రీడాకారులు ,ప్రజలు అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు. ఈ టోర్నమెంట్ కు మొదటి బహుమతి షేక్ మొబిన్ బాషా 15 వేలు, కోట మండల వైసీపీ అధ్యక్షుడు పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆయన తండ్రి పలగాటి పద్మనాభ రెడ్డి పేరున 10వేలు, మూడో బహుమతి వైసీపీ నియోజకవర్గ యువత అధ్యక్షుడు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి ఆయన తండ్రి బుజ్జి రెడ్డి పేరునా 5 వేలు అందించడం వారి సేవలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు, ఇటీవల నెల్లూరు హెలిఫ్యాడ్ వద్ద సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని కలిసి నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వెజ్- నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, ఓల్డ్ ఎంపిడిఓ కార్యాలయం వద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది అని వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి సీఎం క్యాంపు కార్యాలయం అధికారి సల్మాన్ రాజ్ కు నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు అని గుర్తు చేశారు. వైసీపీ నేత కోడవలూరు భక్తవత్సల రెడ్డి మాట్లాడుతూ నల్లపరెడ్డి కుటుంబ పెద్దలు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమితి అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎంతోమంది కి ఉద్యోగాలు,ఎన్నో భవనాలు నిర్మించారు అని తెలిపారు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ముందుచూపుతో మారుమూల గ్రామాలకు రోడ్లు,బ్రిడ్జిలు,స్కూల్ లు,తెలుగంగ కాలువలు, చెప్పలేని ఆంత అభివృద్ధి పనులు చేసి చరిత్రలోనే నిలిచి పోయారు అన్నారు,వీరికి అండగ గోపాల్ రెడ్డి, సుబ్బరెడ్డి నిలిచారు అన్నారు, దురదృష్టవశాత్తు హారనాధ్ రెడ్డి రాజకీయంగా పెద్ద గుర్తింపు పొందకుండా మృతి చెందడం బాధాకరం అన్నారు, నల్లపరెడ్డి కుటుంబ పెద్దలు క్రీడల పట్ల ఎంతో ఆసక్తి చూపే వారు అన్నారు,అలాంటి కుటుంబానికి చెందిన వినోద్ రెడ్డి పెద్దల ఆశయాలు వారి అడుగు జాడల్లో నడవాలి అని కోరుకుంటున్నాం అని వెల్లడించారు, అనంతరం ఎమ్మెల్యే, డిఎస్పీ,అధికారులు, వైసీపీ నేతలు స్వర్గీయ హారనాధ్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, అదేవిధంగా షటిల్ టోర్నమెంట్ ను ప్రారంభించి కొద్దీ చెపు ఎమ్మెల్యే, డిఎస్పి, సిఐ,వినోద్ రెడ్డి షటిల్ ఆడి అలరించారు,అదేవిధంగా టోర్నమెంట్ షీల్డ్ లను ఆవిష్కరించారు, ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి,వైసీపీ నేతలు ఎర్రటపల్లి మధు సుధన్ రెడ్డి,షేక్ మొబిన్ బాషా, సన్నారెడ్డి రాఘవ రెడ్డి,దువ్వూరు రాజగోపాల్ రెడ్డి, ,చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి, గాది భాస్కర్, మూర్తి ఆనంద్, శ్రీనివాసులు,సుధ రెడ్డి, అబ్దుల్లా, కిరణ్,రాయపు పొలయ్య,నర్రమాల రమణయ్య, సాజిద్, వైసీపీ నేతలు, కార్యకర్తలు, నల్లపరెడ్డి అభిమానులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

 227 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.