AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చదువుతున్న విద్యార్థినిని మత్తుమందు ఇచ్చి అత్యాచారం…

1 min read

AABNEWS : తిరుపతి పార్లమెంటు జిల్లా, బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు బిందు రెడ్డి. తెలంగాణ లోని హైదరాబాద్ నగర శివారు ప్రాంతం ఘట్ కేసర్ సమీపంలో బీఫార్మసీ చదువుతున్న విద్యార్థినిని పదవ తేదీ సాయంత్రం సుమారు ఆరు గంటల ప్రాంతంలో కాలేజీ నుంచి బయలుదేరి ఇంటికి వెళుతున్న ఆమెను ఆటో డ్రైవర్ పక్కా వ్యూహంతో మరో ముగ్గురు కలిసి మత్తుమందు ఇచ్చి ఆటో నుంచి బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి సామూహిక అత్యాచారం జరిపి చెట్ల పొదల్లో పడేసి వెళ్లిపోయిన ఘటనకు నిరసనగా ఈ రోజు 150 మంది విద్యార్థినీ విద్యార్థులతో నిరసన తెలియజేయడం జరిగినది. ప్రభుత్వం వారు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా కూడా, వాటిని అమలు పరచడంలో జరుగుతున్న నిర్లక్ష్యం మరియు నిందితులను వెంటనే శిక్షించక పోవడం వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి అని, అదేవిధంగా యూత్ చెడు దారి పట్టడం మరియు ప్రభుత్వ యంత్రాంగాలు ఆడవారి మీద జరిగే అఘాయిత్యాలకు గల మూల కారణాలమీద డ్రైవ్ పెట్టడం, నగర శివార్లలో ఇటువంటి సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు పర్యవేక్షణ, ఇమీడియట్గా అలర్ట్ అయ్యేవిధంగా ప్రత్యేకమైన పోలీస్ బృందాలు, కట్టుదిట్టంగా పని చేసే యంత్రాంగం ఉండాలి అని మేము మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాము. సృష్టికి మూలం స్త్రీ, ఒక మగవారికి స్త్రీ తల్లిగా, చెల్లిగా, బిడ్డగా, ఆలిగా ఉంటుంది. అటువంటి స్త్రీ విషయంలో సాటి మగవారి ఆలోచనా విధానం మారాలి, సమాజంలో ఆడబిడ్డలను కన్న తల్లిదండ్రులకు ఇటువంటి సంఘటనల వల్ల చాలా మానసిక క్షోభ కలుగుతుంది. వీటికి గల మూల కారణాలను ప్రతి ఒక్కరు పరిశీలించి నేను నా కుటుంబం అని మాత్రమే కాకుండా కొంత సమయాన్ని సమాజం కోసం కూడా కేటాయించాలి అని, నిత్యం ఇటువంటి సంఘటనలు ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి, నా బిడ్డ కాదు కదా
అని ఆలోచించకుండా ఇటువంటివి పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరు దృష్టిసారించాలి అని కోరుకుంటున్నాను.

 705 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.