చిట్టమూరు SI ని సస్పెండ్ చేయాలి…
1 min read
AABNEWS : చిట్టమూరు SI ని సస్పెండ్ చేయాలి
✍️ గూడూరులో ప్రెస్ మీట్ లో యానాదుల(గిరిజన)సంక్షేమ సంఘం డిమాండ్
✍️ చిట్టమూరు మండలం బురదగాలి కొత్తపాళెం పంచాయతీ కుమ్మరపాళెం గ్రామంలో గిరిజనులు, దళితులు తమ పోలంలో సాగు చేసుకుంటుండగా సంబంధం లేని వ్యక్తులు రెవెన్యూ అధికారుల సమక్షంలో అడ్డుకుని దౌర్జన్య చేశారు. దీనిపై ఈ నెల 15 వ తేదీన రెవెన్యూ అధికారులు, భాధితులు వేర్వేరుగా ఫిర్యాదు చేసినా ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు.
ఈ వ్యవహారంలో SI నిందితుల వారి తరపున లంచాలు పుచ్చుకుని కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ విషయాన్ని తాము గట్టిగా ప్రశ్నించడంతోపాటు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో SI సెలవుపెట్టి వెళ్లిపోయారు SPగారు, కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేయాలని కోరడమైనది. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కోట్లపాటి వెంకటేశ్వర్లు, ఇండ్ల మల్లి, ప్రజా సంఘాల అధ్యక్షులు LV సుబ్బయ్య, భాధితులు చందమామల పోలయ్య, కోట్లపాటి పోలమ్మ, మానికల పోలమ్మ, సుబ్రమణ్య పాల్గొన్నారు.
77 Total Views, 2 Views Today