AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చిరు వ్యాపారులకు 10వేల రూపాయల చొప్పున బ్యాంకుల…

1 min read

AAB NEWS : గూడూరు పట్టణంలోని వెలుగు కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో కలిసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర లో చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తులు వారు పడుతున్న కష్టాలు చూసి చలించి వాటి నుండి విముక్తి కలిగిస్తూ మ్యానిఫెస్టోలో చెప్పిన మరో వాగ్దానాన్ని నేడు అమలు చేస్తున్న “జగనన్న తోడు” కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద రావు గారు..,

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దాదాపు పది లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు 1000 కోట్ల రూపాయలు వడ్డీలేని రుణాల పంపిణీ ఈ కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టిన జగనన్న ప్రభుత్వం అని..

చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారు రోజువారి పెట్టుబడి కోసం ఎవరిని ఇక ప్రాధేయపడాల్సిన అవసరం లేదు.అధిక వడ్డీలు తెచ్చి అప్పులు పాలయ్యే పరిస్థితి అసలే ఉండదని, మీకు అండగా ఉంటుంది జగనన్న తోడు..,

చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతివృత్తుల వారు పెట్టుబడి అవసరాల కోసం 10.000 రూపాయల వరకు బ్యాంకు ద్వారా ప్రభుత్వమే వడ్డీ కడుతూ సున్నా వడ్డీ రుణాలను అందిస్తుంది జగనన్న ప్రభుత్వం అని..,

గ్రామాలలో మరియు పట్టణాలలో సుమారు ఐదు అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు, అంతకంటే తక్కువ స్థలం లో  కూడా శాశ్వత మరియు తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసుకునే పేదవారు అందరూ అర్హులే అని..,

రోడ్ల పక్కన టిఫిన్ సెంటర్లు నడిపేవారు,రోడ్ల పక్కన ఫుట్ పాత్  పైన ప్రజా ప్రైవేటు స్థలాల్లో తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు, చేనేత మరియు హస్తకళ వస్తువులు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారాలు అందరూ అర్హులే అని ఈ సందర్భంగా తెలియజేశారు.., ఈ కార్యక్రమంలో గూడూరు మునిసిపల్ స్పెషల్ ఆఫీసర్ మణికుమార్,గూడూరు ఎంపీడీవో నాగమణి,మునిసిపల్ ఇన్ఛార్జి కమిషనర్ రమేష్ గారు,బ్యాంకు మేనేజర్లు,చిల్లకూరు మండలం వైఎస్ఆర్సిపి పార్టీ కన్వీనర్ అన్నం రెడ్డి పరంధామ రెడ్డి మరియు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు..

 154 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.