September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జిల్లాలో రోడ్డుభవనాలశాఖ, పంచాయతీరాజ్‌శాఖల ఆధ్వర్యంలో రోడ్లనిర్మాణాలు జరుగాల్సివుంది…

1 min read

AABNEWS : జిల్లాలో రోడ్డుభవనాలశాఖ, పంచాయతీరాజ్‌శాఖల ఆధ్వర్యంలో రోడ్లనిర్మాణాలు జరుగాల్సివుంది. కానీ ఆయా శాఖల నిర్లక్ష్యం మూలంగా గ్రామీణరోడ్లు, ప్రధాన రహదారులు పర్యవేక్షణకు నోచుకోవడం లేదు. ముఖ్యంగా చిల్లకూరు మండలం లోని తూర్పు కనుపురూ లో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ జాతరకు ఆంధ్ర,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రలలో ప్రత్యేక గుర్తింపు ఉంది, మహిమ గల అమ్మవారు కావడంతో అమ్మవారి జాతరకు ప్రతీఏటా భక్తులు లక్షలసంఖ్యలోపోటెత్తారు,అదేవిధంగాప్రతీరోజువందలసంఖ్యలోఅమ్మవారినిభక్తులుదర్శించుకుంటారు. ఇక్కడ వరకు అంతా సవ్యంగా ఉన్న కనుపురూ కు వెళ్లే రహదారులను చుస్తే ప్రజలు భక్తులు,వాహనదారులుభయబ్రాంతులకుగురిఅవుతున్నారు.నడిరోడ్లపై గుంతలు దర్శనమిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జాతీయ రహదారులపై అతివేగం ప్రాణాలు బలిగొంటున్నా.. మండల, జిల్లాలకు వెళ్లే దారుల్లో మాత్రం గుంతలే ప్రయాణీకులఉసురుతీస్తున్నాయి. నడిరోడ్డుపై రెండడుగుల గుంతలు ఏర్పడటంతో వాహనాలు దగ్గరికి వచ్చే వరకు గుంతలు కంటికి కనిపించడం లేదు. వేగంగా వస్తున్న వాహన డ్రైవర్లకు నడిరోడ్లపై గుంతలు ప్రత్యక్షమవడంతో అకస్మాత్తుగా బ్రేకులు వేయడం వాహనాలు అదుపుతప్పడం క్షణాల్లో జరిగిపోతుంది. కోట నుండి తూర్పు కనుపురూ ,గూడూరు నుండితూర్పు కనుపురూకు వచ్చేవాహనాలు ఎదురుగా వస్తున్నమరో వాహనానికి ఢ కొట్టడం లేదా రోడ్డు ఏదో ఒకవైపుకు పల్టీకొట్టడాలు జరుగుతున్నాయి, అమ్మవారి దర్శనం చేసుకొని తమ గమ్యాలకు చేరుకోవాల్సిన ఎందరో అభాగ్యులు ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొందరు క్షతగాత్రులై జీవితాంతం అవిటివారుగా మిగిలిపోయి కుటుంబాలకు భారమవుతున్నారు. అధికారులు రోడ్లను బాగుచేయడంలో చూపిస్తున్న నిర్లక్ష్యం వేలాది కుటుంబాలబతుకుచిత్రాన్నే మార్చివేస్తోంది. రోడ్లపై ఏర్పడిన గుంతలు చిన్నవిగానే ఉన్నాయిలే అనుకునిపట్టించుకోకపోవడంతో ప్రయాణీకుల పాలిట నరకంగా మారుతున్నాయి. తూర్పు కనుపురూ కు వెళ్లే రోడ్లపై ఏండ్ల తరబడి అధికారులు సమీక్షలు కార్యరూపందాల్చలేకపోతున్నాయి. పంచాయతీరాజ్‌ నూతన చట్టాలు వచ్చినా సంబంధిత రోడ్లు మరింత అధ్వాన్నంగామారాయి.మండల కేంద్రాలకు వెళ్లే దారులు కూడా ఎప్పటికప్పుడు మరమ్మతులకునోచుకోకపోవడంతో డ్రైవర్లు వాహనాలు నడిపేందుకు నానాతంటాలు పడుతున్నారు.అదుపుతప్పి ప్రయాణీకులుక్షతగాత్రులవుతూ జీవితాంతం నరకాన్ని అనుభవిస్తుండగామరికొందరు ప్రమాదస్థలిలోనే అసువులు బాస్తున్నారు.
ప్రభుత్వం పాలసీ ప్రకారం టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లు కు అప్పగించడం జరుగుతుంది, అప్పుడు ప్రణాళిక ప్రకారం నిర్దేశించిన గడువు మేరకు రోడ్ల నిర్మాణంతో పాటు ఎప్పటికప్పుడు వాటికి మరమ్మతులు చేసేందుకు కాట్రాక్టర్లనుపురమాయిస్తుంది. కానీ అలాంటి విధానాలేవీ అమలు కావడం లేదు. టెండర్‌ పొందిన కాంట్రాక్టర్లు రోడ్లవేసి చేతులుదులుపుకుంటున్నారు. బిల్లులు వచ్చినా, రాకున్నా మళ్లీ రోడ్ల వంక కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలున్నాయి.
రోడ్లపై ఏర్పడిన పగుళ్లు, గుంతలు ప్రయాణాలకు అడ్డంకులుగామారుతున్నాయి. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు సింగిల్‌రోడ్డు, అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్‌రోడ్లు నిర్మిచారు. కానీ వాటి పర్యవేక్షణలు మాత్రం మరిచిపోయారు. జాతీయరహదారి ప్రమాదాలను పోల్చుకుంటే గ్రామీణ స్థాయిలో ప్రమాదాలు తక్కువేమీ జరుగడం లేదు. జాతీయదారుల్లో అతివేగం డ్రైవర్ల నిర్లక్ష్యం మూలంగా ప్రమాదాలు జరగుతుండగా గ్రామీణ స్థాయిలో మాత్రం కేవలం అద్వాన్నస్థితిలో ఉన్న రోడ్లే ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని చెప్పకతప్పదు.
గూడూరు నుండి కనుపురూ కు,కోట నుండి కనుపురూ కు వచ్చే రోడ్లపై ఎన్నో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కొకల్లు వాహనాలు అదపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపు పదుల సంఖ్యలో తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి కారణం నడిరోడ్డుపై ఉన్న గుంతలేనని ప్రయాణీకులే చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ రోడ్లుపరిస్థితి దారుణంగా వుంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారు నిత్యం నరకం చూస్తున్నారు. పిల్లలు, వృద్ధులు మరిముఖ్యంగా గర్బిణుల పరిస్థితి చెప్పనలవి కాదు. అడుగడుగున్నా గుంతలుదర్శనమిస్తుండటంతో డ్రైవర్‌ బస్సులను అదుపుచేయడానికి గోసపడుతుండగా బస్సుకుదుపులకు ప్రయాణీకుల వెన్నుపూసలు విరుగుతున్నాయి. వృద్ధులు బస్సు ఎక్కాలంటేనే భయపడుతున్నారు. మరి ముఖ్యంగా కోట నుండి కొత్తపట్నం, తూర్పు కనుపురూకి వెళ్లే రహదారులు అంత మలుపులు, గుంతలు మయం జాతర సమయంలో అయితే ట్రాఫిక్ కష్టాలు,గుడికి మాత్రం కోట్ల రూపాయలుఆదాయాలువస్తున్నాయి,ఆర్టీసీకిఆదాయాలు ,ప్రభుత్వానికి వివిధ రూపాల్లో ఆదాయాలు వస్తున్న ప్రజలు,భక్తులు కోసం రోడ్లు మాత్రం నిర్మించారు, అధికారులు, ప్రజా ప్రతినిధులు మాత్రం పేపర్ ప్రకటన ల్లో మాత్రం హడావిడి చేస్తారు. ఇకనైనా అధికారులు స్పందించి కనూపురు రోడ్లను బాగుచేయాలి అని,జాతరకు ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలి అని ప్రజలు,భక్తులు వేడుకుంటున్నారు.

 567 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.