September 19, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

తిరుపతి ఉప ఎన్నికల జిల్లాలోని కోట,వాకాడు,చిట్టమూరు,చిల్లకూరు, నాలుగు మండలాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నామని…

1 min read

AABNEWS :తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ఎంపీ అభ్యర్థిని పరిచయం చేస్తూ ఈ నెల 4 వ తారీఖున నెల్లూరు జిల్లాలోని కోట, వాకాడు, చిట్టమూరు ,చిల్లకూరు నాలుగు మండలాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరవుతున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి , రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. తిరుపతి పార్లమెంట్ వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ని 70 వేల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గురువారం రోజున నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి.ప్రసన్నకుమార్ రెడ్డి, గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపల్లి.వరప్రసాద్ రావు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ 4 వ తారీఖున జరిగే బహిరంగ సభలను విజయవంతం చేసి ప్రతిపక్షాలకు సవాల్ విసరాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి.ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిందని , రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపు 97 వేల కోట్లు ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఖర్చు పెట్టడం జరిగిందని వెల్లడించారు. సీఎం జగన్ సహకారంతో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు ఒక్క కోట మండలానికే దాదాపు150 కోట్లకు పైగా నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. తిరుపతి పార్లమెంట్ ఎంపీ సీటును సీఎం జగన్ కు మరొక బహుమతిగా ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి. వరప్రసాద్ రావు మాట్లాడుతూ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని సీఎం జగన్ నిలబడుతున్నట్లుగానే భావించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని 4 వ తారీఖున జరిగే భారీ బహిరంగ సభలను విజయవంతం చేయాలని వైసీపీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నల్లపురెడ్డి.వినోద్ కుమార్ రెడ్డి పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

 275 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.