AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

దేశ భవిశ్యత్ ను కాపాడాల్సిన బాధ్యతయువకులది…

1 min read

AABNEWS : శాస్త్రీయ మైన ఆలొచనలతో దేశ భవిశ్యత్ ను కాపాడాల్సిన బాధ్యత యుకులది .

:- అరిగెల నాగేంద్ర సాయి, ప్రముఖ న్యాయవాది.

అఖిలభారత యువజన సమాఖ్య (ఏ.ఐ.వై.ఎఫ్) నూతన సంవత్సర క్యాలెండర్‌ ను మాగుంట లే అవుట్ లో నందు గల ప్రముఖన్యాయవాది , ది.నెల్లూరు కో – ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ , అరిగెలనాగేంద్రసాయి ఆఫీసునందు , ఏ.ఐ.వై.ఎఫ్ మాజీ నాయకులు , అఖిలభారత అభ్యుదయ వేదిక(ఏ.ఐ.పి.ఎఫ్) జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ! దేశ చరిత్రలో అఖిలభారత యువజన సమాఖ్య యొక్క పాత్ర స్వర్ణాక్షరాలతో లిఖించదగినదని , “ఉధ్యోగమైనా ఇవ్వండి – జైల్లో అయినా పెట్థండి ” అనే నినాదంతో దేశవ్యాపితంగా నిరుద్యోగులను సమీకరించి పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించి ప్రభుత్వరంగ సంస్థలలో పేరుకు పోయిన ఖాళీలను పూరించడంలో ప్రధాన భూమికపోషించింన ఘనత యువజన సమాఖ్య కు ఉందని , శాస్త్రీయ సోషలిజం స్థాపనకోసం , అభ్యుదయ భావనలతో యువకుల లో చైతన్యం నింపి దేశాభివృద్ధిలో కీలకపోత్రపోషిస్తుందని అన్నారు , అయితే నేటి పరిస్థితుల లో మరింత దూకుడుగా యువకులను సంఘటితం చేయవలసిన అవసరం ఉందని , ప్రధానంగా నరేంద్రమోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యక్షంగా యువకులను పెడదారిన పట్టేవిధంగా వారిలో ఆధ్యాత్మికమైన సెంటిమెంట్ రెచ్చగొడుతూ , మత ఛాందసవాదులుగా – కుల ఛాందస వాదులగా తయారు చేసి , వారి పరిపాలన లోపాలను యివకులు గమనించకుండా , యువకుల లో ప్రశ్నించే తత్వం రాకుండా జాగ్రత్తపడుతుందని , అందుకే నరేంద్రమోడీ చెప్పిన రెండుకోట్ల ఉధ్యోగాలు ఇవ్వకపోయినా , నోట్లరద్దుతో సామాన్యుడి బ్రతుకులు ధ్వంసం అవుతున్నా , దేశ ఆర్ధిక పరిస్థితులు క్షీనిస్తున్నా , గ్లోబల్ ఎకనమీ లో మన దేశ వృద్ధిరేటు పాతాలానికి పడిపోయినా ఎవ్వరూ గుర్తించకుండా మతాల మధ్య సెంటిమెంట్ ను రెచ్చగొట్టి యువకల ఆలోచనలను పక్కదారి మళ్లిస్తున్నారని అవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా ఫారన్ పాస్ట్ కల్చర్ పేరుతో యువకులు పెడదారిన పడుతూ డ్రగ్స్ , మధ్య , ధూమ పానాలకు బానిలుగా మరుతున్నా , సాటి అక్కా చెల్లెల్లు లాంటి ఆడపిల్ల ల పట్ల ప్రేమపేరుతో వేధించడం వారు నిరాకరిస్తే దాడులు చేసి గాయపరచడం , చంపివేయడం, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించడం జరుగుతున్నా ప్రభుత్వాలు వాటిమీద దృష్టి పెట్టకుండా , వ్యాపారస్థుల కు ప్రయోజనాలు చేకూర్చేవిధంగా పాలనచేసేవిధంగా తయారయ్యారని ,రాజకీయ నాయకుల చొరవతో ఎంతోమంది అసాంఘిక శక్తులను శిక్షల నుంచి తప్పించేస్తున్నారని, ఈ తరుణంలో ఏ.ఐ.వై.ఎఫ్ మరింత దూకుడుగా పోరాట స్ఫూర్తిని యువకుల లో నింపి శాస్త్రీయ మైన ఆలోచనలతో యువకులను దేశ భవిష్యత్ కు ఉపయోగపడేవిధంగా వారిని తీర్చిదిద్దటానికి కంకణ బద్ధిలై పనిచేయాలని , అసాంఘిక శక్తులకు దేహశుద్ధిచేసి ఆడపిల్లకు అండాగా ఉండాల్సిన బాధ్యత మనమీద ఉందని అన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాలు పదేపదే అబద్దాల ప్రచారాలతో దేశ ప్రజలను మభ్యపెడుతున్నాయని దీనిని యువకులు వాస్తవిక ఆలోచనలు , ఆధారాలతో త్రిప్పికొట్టేవిధంగా సోషల్ మీడియాను కూడా ఉపయోగించుకోవాలని తెలియజేశారు. ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లా నాయకులు యాదాల సునీల్ మాట్లాడుతూ ,రెండు కోట్ల ఉధ్యోగాలు మేము అధికారంలోకి వచ్చాక ఇస్తామని చెప్పిన మోడీ మొండిచేయి చూపించి వారి స్వరాష్ట్రం , వారి బందువులు , వారి కులస్టులైన కార్పోరేట్ వ్యాపారులకు వేలకోట్లరూపాయలు ప్రయోజనాలు చేకూర్చేవిధంగా దేశ సఁపదను , ప్రజా ధనాన్ని దారిమళ్లిస్తున్నారని , దేశ భద్రతకు ముప్పు వాటిల్లే విధాన పాలన చేస్తూ , దేశ భక్తి ముసుగులు దానిని సమర్ధించుకుంటూ , నయా నియంతలా నరేంద్రమోడీ తయారయ్యారని , ప్రజలను అజ్ణానులు గా మార్చడానికి మూడనమ్మకాను ప్రజలలో మరింత లోతుకు పాతడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ , కరోనా లాంటి మహమ్మారి వ్యాధితో ప్రజలు ప్రాణాలు పోవడానికి ప్రధానమంత్రి పరోక్షంగా , ప్రత్యక్షంగా కారణమని , ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ ఎందుకోసం ఎంత ఖర్చుపెట్టారో స్వేతపత్రం రిలీజ్ చేసి ఆయన చిత్త శుద్ధి నిరూపించుకోవాలని యువకులుగా మనం ప్రశ్నించకపోతే నయా హిట్లర్ లాగా నరేంద్రమోడీ మనల్ని అణగదొక్కడం కాయమని యువకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది అజయ్ కుమార్ ,వాటంబేటి నాగేంద్ర , వెంకటేష్, కమల్ , మాబ్జాన్ తదితరులు పాల్గొన్నారు.

 126 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.