September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదా…

1 min read

AABNEWS : ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదు..
రైతులపై వివక్ష తగదు.. అఖిల భారత యువజన సమాఖ్య
గూడూరు : ఏడాది కాలంగా అమరావతిలో రైతులు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా నాయకులు సునీల్ యాదాల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక కటకరాజావీధిలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టక ముందు అమరావతియే రాజధానిగా ఉండాలని మద్దతుగా నిలిచి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులతోనే అభివృద్ధి అంటూ మాట మార్చడం దారుణమన్నారు. అసలే లోటు బడ్జెట్ తో అల్లాడుతుంటే ళరాజధానుల ఏర్పాటుకు నిధులు ఎలా వస్తాయన్నారు. తినేందుకు గింజల్లేకపోతే మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా, ఏడాది పూర్తయిన అమరావతి రైతులకు మద్దతుగా సీపీఐ నాయకులు చలో అమరావతికి సన్నద్ధమవుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ సీపీఐ నాయకులను గృహ నిర్భంధం, నోటీసులు జారీ చేసి అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. రైతుల పక్షపాతి అని చెప్పుకునే సీఎం అన్నదాతల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ పట్టణాధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేసే ఏ ప్రభుత్వమైనా మనుగడ సాధించిన దాఖలాలు లేవన్నారు. పూటకో మాట మాట్లాడుతూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. అమరావతి రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు వెంకటేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.

 134 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.