AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ప్రవళిక కు అండగ…

1 min read

AABNEWS : ప్రవళిక కు అండగ దాతలు ఎంబిబిఎస్ సిటు సాధించిన పేద విద్యార్థిని ప్రవళికకు దాతలు చేయూత తిరుపతి పద్మావతి మెడికల్ కళాశాల లో సిటు సాధించిన ప్రవళికకు అండగ శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి నెల్లూరు మూలపేటకు చెందిన గిరిజన కుటుంబానికి చెందిన ప్రవళికకు అండగ నిలిచిన అల్లం రమణయ్య మెడికల్ లో ట్యూషన్ ఫీజు మరియు ఇతర ఫీజులకు 94,500 కట్టవలసిన పరిస్థితి దాతలు నుండి ఆర్ధిక సాయం చేయించిన అల్లం రమణయ్య ప్రవళిక కు కావలిసిన వస్తూ సాగ్రిని తీసిఇచ్చిన అల్లం రమణయ్య ఆనందం వ్యక్తం చేసిన విద్యార్థిని ప్రవళిక మరియు కుటుంబ సభ్యులు నెల్లూరు కు చెందిన దువ్వూరు నగేష్ రెడ్డి 10 వేలు, రాపురూకు చెందిన నల్లు హర్షవర్ధన్ 5 వేల రూపాయలు, మన్నరుపోలూరు కు చెందిన ప్రతాప్ రెడ్డి 5 వేల రూపాయలు, చెన్నైకి చెందిన నాగల పురం గిరిధర్ రెడ్డి 10 వేల రూపాయలు 30 వేల రూపాయలు చెక్కును అందించిన అల్లం రమణయ్య అల్లం రమణయ్య కు కృతజ్ఞతలు తెలిపిన ప్రవళిక,కుటుంబ సభ్యులు శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి ద్వారా నిరంతరం పేద,బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం,వికలాంగులు,వృద్దులు,అనాదులనుఆడుకుంటూ,పేదవిద్యార్థులకు చేయుతను అందిస్తూ ప్రగతి పథంలో పయనిస్తు అనతి కాలంలోనే మంచి గుర్తింపు పొందిప్రజలఆదరాభిమానాలు అందుకుంటుంది, ట్రస్ట్ అధ్యక్షుడు అల్లంరమణయ్య నేతృత్వంలో సభ్యులు అహర్నిశలు శ్రమిస్తూ పేదల సంక్షేమంకోసం,ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు,అల్లం రమణయ్య చేస్తున్న సేవ కార్యక్రమాలకుఎంతోమంది దాతలు ముందుకు అల్లం రమణయ్య ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ విజయయాత్రలో ముందుకు సాగుతున్నారు, ఈ ఏడాది లోనే ఎంతో మంది పేద విద్యార్థులకు ల్యాప్ టాప్ లు,ఎంతో మందికి ఆర్ధిక సాయాలు అందించారు. ఇప్పుడు ఇదే పంథాలో నెల్లూరు మూలపేట కొండ దిబ్బ కు చెందిన గిరిజన విద్యార్థిని ఉప్పలపు ప్రవళిక కు అండగ అల్లం రమణయ్య నిలిచి దాతల దాతృత్వం లో 30 వేల రూపాయలను గురువారం కోట గ్రామంలోని శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి కార్యాలయంలో ప్రవళిక కు అందజేశారు, ఈ సందర్భంగాఅల్లంరమణయ్య మాట్లాడుతూ ప్రవళిక తల్లిదండ్రులు నిరుపేదలు కావడం వారి పరిస్థితి రెక్కాడితే కానీ డొక్కా ఆడదు అలాంటి కుటుంబం నుండి ప్రవళిక కష్టపడి చదివి తిరుపతి పద్మావతి మెడికల్ కళాశాలలో 435 మార్కులు సాధించి ఎం బి బి ఎస్ సిటు సాధించింది అని ఆయన తెలిపారు, కానీ ప్రవళిక మెడికల్ కళాశాలో ట్యూషన్ ఫీజు మరియు ఇతరత్రా ఫీజులు కలిపి మొత్తం 94,500 రూపాయలు చెల్లించాలి అనీ కళాశాల వారు సూచించడం జరిగింది అని అదికూడా చివరి రోజు గురువారం లోపు చెల్లించాలి, ఇలాంటి తరుణంలో ప్రవళిక ఆందోళన చెందుతు శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి ని సంప్రదించడం తో ఆమె కట్టే మొత్తం ఫీజులో 30 వేల రూపాయల అందించడం జరిగింది అని తెలిపారు. ప్రవళిక పరిస్థితి ని దాతలు దృష్టికి తీసుకెళ్లడం తో దాతలు నెల్లూరు కు చెందిన దువ్వూరు నగేష్ రెడ్డి 10 వేలు, రాపురూకు చెందిన నల్లు హర్షవర్ధన్ 5 వేల రూపాయలు, మన్నరుపోలూరు కు చెందిన ప్రతాప్ రెడ్డి 5 వేల రూపాయలు, చెన్నైకి చెందిన నాగల పురం గిరిధర్ రెడ్డి 10 వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించి తమ దాతృత్వాని మరోసారి చాటారు అన్నారు,దాతలు ఆ దించిన నగదు 30 వేల రూపాయల చెక్ ను ప్రవళి కు అందించాం అన్నారు. ఎంతోమందికి కోట్ల రూపాయలు ఉన్న కూడా మెడికల్ సిటు సాధించడం కష్టతరం అని అలాంటి పరిస్థితిలో పేద కుటుంబానికి చెందిన ప్రవళిక కష్టపడి చదివి 435 మార్కులు సాధించి ఎం బి బి ఎస్ సిటు సాదించడం గొప్ప విషయం అన్నారు, అయితే ప్రవళిక మెడికల్ కళాశాలో ట్యూషన్ ఫీజు ఇతరత్రా ఫీజులు మొత్తం 94,500 రూపాయల కట్టవలసిన ఉన్న తరుణంలో అదికూడా గురువారం లోపు కట్టవలిసి ఉండగా ప్రవళిక కు శ్రీ షిరిడీ సాయి అక్షయ సేవా సమితి దాతలు సహకారంతో 30 వేల రూపాయలు అందించడం జరిగింది అని ఆయనతెలిపారు,అదేవిధంగా ప్రవళికకు కావలసిన బట్టలు,వస్తూ సామగ్రిని 5 వేల రూపాయలు ఖర్చు చేసి తీసిఇచ్చినట్లు తెలిపారు ప్రవళిక కష్టపడి ఎం బి బి ఎస్ పూర్తి చేసి ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు గా చేరి పది మంది కి సాయం చేస్తే తమకు ఎంతో సంతృప్తి గా ఉంటుంది అని ఆయన కోరారు,అనంతరం ప్రవళిక ఆనందబాష్పలతో అల్లం రమణయ్య,సమితి సభ్యులు, దాతలకు కృతజ్ఞతలు తెలిపింది,కష్ట కాలం లో సాయం చేసిన అల్లం రమణయ్య రుణం తీర్చుకోలేం అనీ ప్రవళిక పేర్కొన్నారు,ఈకార్యక్రమం సమితి సభ్యులు పేళ్లురు కోటేశ్వరరెడ్డి, కంచె పన్నగ సాయి, పిట్టి జనార్ధన్ ద్యార్థిని ప్రవళిక, ఆమె తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

 422 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.