September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బంగారు నగల చోరీ కేసులో ముద్దాయిని అరెస్ట్…

1 min read

AABNEWS : నెల్లూరు జిల్లా.. చిల్లకూరు మండలం. బంగారు నగల చోరీ కేసులో ముద్దాయిని అరెస్ట్ చేసిన చిల్లకూరు పోలీసులు..నిందితున్న మీడియా ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించిన Ci.శ్రీనివాసులురెడ్డి. చిల్లకూరు మండలం భూదానం గ్రామంలోని పాత హరిజనవాడలో నవంబర్ 8.వ తేదీన పసల నాగమ్మ అనే ఆమె ఇంటికి తాళం వేసి పనిమీద బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తాళం పగలగొట్టి బీరువా లాకర్ లో ఉన్న 13 సవర్ల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లారు.బాధితురాలు ఇచ్చిన పిర్యాదు మేరకు Si.బాబీ సంఘటన స్థలానికి క్లూస్ టీమ్ తో వెళ్లి వివరాలు సేకరించి నేరానికి పాల్పడిన తూర్పు గోదావరి జిల్లా సంబశివరాం కాలానికి చెందిన కాళ్ళ నరేష్ గా గుర్తించి చాకచక్యంగా కేసును చేధించి నిందితుడు అరెస్ట్ చేశారు.ఈ మేరకు రూరల్ ci. శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నిందితుడు నరేష్ ని అదుపులోకి తీసుకొని నగలను రికవరీ చేశామన్నారు.ఇతనిపై సుమారు 20 కేసులు ఉన్నాయని ఇతను పాత నేరస్తుడని వివరించారు.చాకచక్యం నిందితుడిని పట్టుకున్న si.బాబీ ని సిబ్బందిని అభినందిచ్చారు

 187 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.