బానిస కావద్దు…
1 min read
AABNEWS : యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు గూడూరు లో మత్తు పదార్థాలు నిషేధం పై అవగాహన ర్యాలీ మత్తు పదార్థాలు వాడకం,అమ్మకం నిషేద్దం పట్టణ సిఐ దశరథ రామారావు
నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని గూడూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు పేర్కొన్నారు, శుక్రవారం గూడూరు పట్టణంలో మత్తు పదార్థాలు నిషేధం పై అవగాహన సదస్సు మరియు ర్యాలీ పట్టణ సిఐ దశరథ రామారావు ఆధ్వర్యంలో జరిగింది, ఈ ర్యాలీలో పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు, యువత పాల్గున్నారు, ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్,గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి ఆదేశాలు మేరకు గూడూరు పట్టణంలో మత్తు పదార్థాలు నిషేధంపై అవగాహన సదస్సు, ర్యాలి నిర్వహించినట్లు తెలిపారు, కొందరు పని వత్తిడి వల్ల మత్తు పదార్థాలకు బానిసలై అనారోగ్యంపాలవుతున్నారని తెలిపారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లే శక్తి యువతపై ఉందని యువత మద్యపానానికి దూరంగా ఉండాలని కోరారు. యువకులు గుట్కాలకు అలవాటుపడి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. మాదకద్రవ్యాలకు బానిసలు కావద్దని సిఐ దశరథ రామారావు అన్నారు. మాదకద్రవ్యాలకు యువత బానిసై తమ జీవితాలను నాశనంచేసుకుంటున్నారన్నారు. అందువల్ల మాదక ద్రవ్యాలకు దూరంగా వుండాలన్నారు. అనంతరం చట్టాలపై అవగాహన కలిగించారు.మాదకద్రవ్యాల వినియోగం మరియు అమ్మకం చట్టరీత్యా నిషేధం అనీ, అందువలన మాదకద్రవ్యాలు ఎవరైనా విక్రయించినా వాడినా కఠినమైన శిక్షలు చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు, ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమం లో గూడూరు పట్టణ సిఐ దశరథ రామారావు తో పాటు ఒకటవ పట్టణ ఎసై సైదులు,పోలీసు సిబ్బంది స్వచ్చంద సంస్థలు,పట్టణ యువత తదితరులు పాల్గొన్నారు
128 Total Views, 8 Views Today