AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బాలికల హాస్టల్ నందు సావిత్రి బాయి పూలే గారి 124 వ వర్ధంతి

1 min read

AABNEWS : గూడూరు రెండోవ పట్టణంలోని మాలవ్య నగర్ సమీపంలోని బీసీ బాలికల హాస్టల్ నందు సావిత్రి బాయి పూలే గారి 124 వ వర్ధంతి సందర్భంగా ఈరోజు జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి గణ నివాళులర్పించిన గూడూరు శాసన సభ్యులు డాక్టర్ శ్రీ వెలగపల్లి వరప్రసాద్ రావు గారు. మహిళల ప్రాధాన్యత ప్రతి చోటు ప్రతి దేశంలో సమాజంలో గుర్తుచేసుకుంటున్నాము అని. భగవంతుడు అన్ని చోట్లా ఉండలేడు కనుక ఒక తల్లి రూపంలో మహిళను సృష్టించాడు అని తెలిపిన ఎమ్మెల్యే గారు. ఒక మహిళకు ప్రాముఖ్యత ఇచ్చి మహిళ అంటే ఇలాగే ఉండాలి సమాజానికి తెలిపిన మొట్టమొదటి మహిళా ఉన్నారంటే ఆ తల్లి సావిత్రి బాయి పూలే అని గర్వంగా తెలిపిన ఎమ్మెల్యే గారు గతంలో బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు చెప్పిన తల్లి సావిత్రి బాయి పూలే అని తెలిపారు ఈ కార్యక్రమంలో సీమాంధ్ర బీసీ సంక్షేమ బహుజన సమాజ సంస్థ విజయలక్ష్మి, శంకరయ్య వైస్సార్సీపి పార్టీ నాయకులు నరేష్, చోళ్ళవరం గిరిబాబు, నరసయ్య, మనోహర్,దిలీప్ మరియు పలువురు ప్రముఖులు బాలికలు పాల్గొన్నారు.

 161 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.