AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్. రాజ్యాంగ దినోత్సవ వేడుకలు…

1 min read

AAB NEWS : భారత రాజ్యాంగ 71వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గూడూరుకు చెందిన బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, రాజ్యాంగ అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులు దాసరి సురేష్ చైతన్య మాట్లాడుతూ.. 1947 ఆఘస్టు 29న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఛైర్మన్ గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడిందని, రెండు సంవత్సరాల, పదకొండు నెలల, పద్దెనిమిది రోజులలో భారత రాజ్యాంగం పూర్తి చేయబడి, అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని, రాజ్యాంగ పరిషత్ ఆమోదించినదని, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత రాజ్యాంగం గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ మేధా సంపత్తిని, ప్రతి భారతీయుడు గర్వించదగ్గ రాజ్యాంగ నిర్మాణాన్ని కొనియాడారు. ఉపాధ్యక్షులు ఆత్మకూరు సురేష్ మాట్లాడుతూ.. స్వేఛ్ఛ, సమానత్వాలు ఈ దేశంలో ఊసుగా వినపడుతున్నాయంటే, అది బాబా సాహెబ్ అంబేడ్కర్ పుణ్యమే అన్నారు. సభ్యులు మస్తాన్ మాట్లాడుతూ.. స్త్రీలుసైతం సామాజిక వైకల్యాలను ఎదురించి ఉన్నత స్థానాలను అధిరోహించే వెసులుబాటు బాబా సాహెబ్ అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగం ద్వారా సుసాధ్యమైనదన్నారు. బి.యస్.పి. పార్టీ గూడూరు నియోజకవర్గ ఇంఛార్జ్ గ్రిద్దలూరు రఘు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాలకు నేటి చట్టాలు రక్షణ కవచాలుగా నిలుస్తున్నాయంటే ఆ మహనీయుని రాజ్యాంగ నిర్మాణం వలనే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మోహన్, నిరంజన్, మల్లి, వినోద్ తదితరులు పాల్గొన్నారు

 94 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.