AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మహాజనసైన్యం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు MJS. సురేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు యల్లసిరి.నాగార్జున మాట్లాడుతూ…

1 min read

మహాజనసైన్యం ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ మరియు విద్యార్థి ఉద్యమ సైన్యం మహాజనసైన్యం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు MJS. సురేంద్ర, రాష్ట్ర అధ్యక్షులు యల్లసిరి.నాగార్జున మాట్లాడుతూ… R.S ప్రవీణ్ కుమార్ గారిపై అవాకులు,చవాకులు పేలుతున్న బండి.సంజయ్ కి ఆల్ రెడీ గండి పడింది.RSS,BJP కి దళిత,గిరిజన,బడుగు,బలహీన వర్గాల ప్రజలు ఉన్నత స్థితికి చేరుకోవడం ఇష్టం లేదు వీరు ఉన్నత స్థితికి చేరుకుంటే ప్రశ్నించే స్థాయికి చేరటమే కాకుండా ఆర్ధికంగా స్థిర పడుతారని,రాజకీయంగా,సామాజికంగా అభివృద్ధి చెందుతారని కుళ్ళుతో,కుతంత్రంతో పన్నాగాలు పన్నుతున్న BJP,RSS చెత్త ప్రయత్నాలు చేస్తుంది.బీజేపీ,RSS వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వం.7 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవడం మినహా మీరేమి ఒరగ బెట్టింది లేదు.అదే R.S ప్రవీణ్ కుమార్ గారు 8 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం చేయాల్సిన పనిని చేసి చూపడమే కాకుండా చరిత్ర సృష్టించాడు…ఒకప్రభుత్వ_అధికారిఇన్నిచేస్తే

7ఏళ్ళుఅధికారంలోఉన్న_మీరెన్నిచెయ్యాలి

ప్రవీణ్_కుమార్IPS 8ఏళ్లలో చేసిన విశిష్టమైన కృషి వల్ల ఈ రాష్ట్రంలో

900 స్కూల్స్,
50 డిగ్రీ కాలేజీలు,
7 PG మహిళ కాలేజీలు,
ఒక సైనిక్ స్కూల్
ఒక సైనిక్ డిగ్రీమహిళ కాలేజ్ (దేశంలోఎక్కడా లేదు)
ఒక లా కాలేజ్
ఒక కోడింగ్ స్కూల్ (దేశంలో ఎక్కడా లేదు)

#0C_BC_SC_ST_MINORITY అన్ని మతాల,కులాల వారికోసం ఏర్పాటు అయ్యాయి.

450 డాక్టర్లుగా
270 మంది ఢిల్లీ యూనివర్సిటీ
300 మంది అజీమ్ ప్రేమ్జి యూనివర్సిటీ
10 మంది అశోక యూనివర్సిటీ
5 మంది శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్
20 మంది ఎవరెస్టు శిఖర అధిరోహితులుగా
10 మంది CCIP అమెరికా
2 ఇద్దరు హార్వార్డ్ యూనివర్సిటీ
2 ఇద్దరు లండన్ రాయల్ కాలేజ్
4 మంది నేషనల్ క్రికెట్ ప్లేయర్స్ గా
2 ప్రపంచ స్థాయి అట్లెట్స్ గా

ఇలా చెప్పుకుంటే ఆయన టీం తో చేసిన కృషి అనన్య సామాన్యమైనది వెలకట్టలేనిది.

మట్టిలో నుండి పుట్టిన విత్తనం ఎంత తేజోమయమై ఉంటదో, ప్రవీణ్ కుమార్ కూడా అంతే గొప్పగా ఉంటాడు. అధికారంలో ఉండి కాదు, ఒక IPS గా ఉండి ఇన్ని చేశాడు.

7 సంవత్సరాలుగా మీరు BJP కేంద్రంలో అధికారంలో ఉన్నారుగా ఇప్పటి వరకు కనీసం ఒక కొత్త స్కూల్ కట్టించారా చెప్పండి ??? అంతెందుకు ఒక అంగన్వాడీ కేంద్రం అయిన కట్టించారా ??? ఎంత మంది నిరుద్యోగ హిందువులకు ఉద్యోగం కల్పించారు ??? ఎంత మంది పేద హిందువులకు ఎన్ని వేల ఇండ్లు కట్టించారు ??? ఇవన్నీ ఇవ్వకపోగా BSNL, AIRPORTS, RAILWAY, LIC, విశాఖ ఉక్కు ను అంత #అంబానీ_ఆదాని ల కోసం దార పొయ్యడం నిజం కాదా ???

అందులో ఉద్యోగం చేస్తున్న మధ్య తరగతి, పేద హిందువులను రోడ్డు పై నిలబెట్టింది నిజం కాదా ??? పేద హిందు మహిళలపై మీ నాయకులు చేస్తున్న సామూహిక హింస హత్యలు నిజం కావా ??? పేద దళితులు గుల్లోకి వస్తే వారికి వెలివేస్తుంది నిజం కాదా ??? అంతెందుకు మీరు ఒక పేద హిందు BC అమ్మాయికి , ఒక పేద రెడ్డి లేదా బ్రాహ్మణ హిందూ అబ్బాయికి కట్నం లేకుండా పెళ్లికి ఒప్పుకుంటారా ??? నిజంగా మీరు సపోర్ట్ కోసం పేద హిందువులు కావాలి.

పెళ్లిళ్లు-అధికారం మాత్రం బలిసిన భూస్వామ్య, పెద్దకులపొల్లకు ఇస్తారు. ఇదేనా తోటి హిందువు మీద మీరు చూపించే ప్రేమ ??? మిరే ఆత్మ విమర్శ చేసుకోవాలి BJP నాయకులారా ?? మతం పిచ్చితో BC, SC, ST, OC పేదవారికి న్యాప్ కిన్ లాగా వాడుకుంటున్న జుగుప్సాకరమైన నేతల్లారా ??

స్వేరోస్ గా మేము మా కష్టార్జితంలో నుండి పే బ్యాక్ టు సొసైటీలో భాగంగా మా చేతి నుండి డబ్బులు వేసి, ఒక రోజు అక్కడ పని చేసి (ప్రవీణ్ కుమార్ సార్ తో సహా తెలంగాణ లోని నలు మూలల నుండి వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి) #భీందీక్షలో భాగంగా #స్వేరోస్భీంహోమ్ వరంగల్ జిల్లాలోనే 15 మంది నిరుపేద హిందువులకు ఇండ్లు కట్టించాము. కరోన టైం లో విద్యాసంస్థలు మూత పడితే 27 వేల #స్వేరోసర్కిల్స్ ఓపెన్ చేసి లక్షలాది మంది హిందు,ముస్లిం, క్రిస్టియన్ పిల్లలు #స్వేరోకమాండర్ ని పెట్టి వేలాదిగ్రామాల్లో ఉచితంగా చదువు చెప్పించాము. జ్ఞానం కోసం #డిజిటల్లైబ్రరీలుఅంబెడ్కర్విజ్ఞానమందిరాలు ఆరోగ్యం కోసం ఫిట్ ఇండియా ( గౌరవ PM మోడీ మా కార్యక్రమాన్ని చూసే ఫిట్ ఇండియా ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు) అనే కార్యక్రమంతో #స్వేరోజిమ్ లు వెలిసేలా చేశాము. ఆడ పిల్లను కనడమే మానేయ్యలని చూసిన తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కాకూడదు అని #డౌరీఫ్రీ_మ్యారేజ్ వంలాది మందితో కట్నం లేని మ్యారేజ్ చేశాము. వేలాది మంది టీచర్లుగా , పోలీసులుగా ,సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా , ఉద్యోగా వ్యాపార రంగాల్లో ఆత్మస్థైర్యం తో ,నమ్మకంతో, ఎవరికి తక్కువ కాదు అని ఆకాశమే హద్దుగా ఎదగాలని వినూత్న ప్రయాత్నాలతో దేశ0 ప్రపంచ దేశాల ముందు సూపర్ పవర్ గా ఉండేలా జ్ఞానయుద్దం చెయ్యాలని మాలో ఆత్మ విశ్వసాన్ని నింపి అన్ని రకాలయిన జ్ఞానంతో ముందుకు వెళ్తున్నాం. అట్టడుగు వర్గాల్లోని జ్ఞానాన్ని దాచివేయబడిన టాలెంట్ను ప్రవీణ్ కుమార్ సార్ బయటికి తెస్తుంటే మీకు నచ్ఛడం లేదా ?? అంటే పేద బీసీ హిందువులు, యస్సి హిందువులు, oc హిందులు ఎస్టీ హిందువులు గొప్పగా ఎదగడం మీకు ఇష్టం లేదు కదా ??? మీ జెండాలు మోస్తూ, మీరిచ్చిన బీరు,బిర్యానీ,500/- వందలు తీసుకుని మీకు ఊడిగం చేసి మా బతుకులు బజారు పాలు చేసుకోలేం. ఇకపై మీ ఆటలు సాగవు ,మీరు తానా అంటే తందాన అనే రోజులు పోయినవి. మీ మత కుట్రలను తిప్పి కొడతాం, మా పేద హిందువుల దెబ్బ రుచి చూపిస్తాం.
కబడ్ధార్….మహాజనసైన్యం
[21/03, 1:06 pm] మహాజనసైన్యం సురేంద్ర: పై కార్యక్రమంలో జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు MJS. సురేంద్ర,రాష్ట్ర అధ్యక్షులు యల్లసిరి. నాగార్జున,సాయి రాజా,యశ్వంత్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.

 1,540 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.