AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మహిళ అంటే ఆకాశంలో సగభాగమని…

1 min read

AABNEWS :ప్రతి రంగంలో మహిళలు రాణించాలని గూడూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు ఆకాంక్షించారు. మహిళ అంటే ఆకాశంలో సగభాగమని.. ఆర్థిక, సామాజిక, రాజకీయంగా వారికి సమాన హక్కులు కల్పించాలని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు ఏపీ ప్రభుత్వం అందజేసిన దిశ పెట్రోల్‌ వెహికల్స్‌ ను సోమవారం గూడూరు 1 వ పట్టణ పోలీసు స్టేషన్లో సిఐ దశరథ రామారావు ఆవిష్కరించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల రక్షణకు ఇప్పటికే అధిక ప్రాధాన్యమిస్తున్న వైసీపీ ప్రభుత్వం.. తాజాగా 900 దిశ పెట్రోల్‌ వెహికల్స్‌, 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. జీపీఎస్‌, దిశ యాప్ రెస్పాన్స్ సిస్టమ్‌తో అనుసంధానం చేసే సైబర్ కియోస్క్‌లను సీఎం ఆవిష్కరించారు అని.అలాగే బాలికలకు ఉచిత నాప్‌కిన్స్ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు అని వెల్లడించారు. మహిళ పోలీసులు విధి నిర్వహణలో తమ సత్తా ఏమిటో చాటుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వందిశ పెట్రోల్‌ వెహికల్స్‌ అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పట్టణంలో మహిళల రక్షణ కొరకుదిశ పెట్రోల్‌ వెహికల్స్‌ ఎంత గానో ఉపయోగపడుతాయి అని ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సై,పోలీసు సిబ్బంది తదితరులు ఉన్నారు.

 2,121 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.