AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మహిళ పోలీసులకు అవగాహన సదస్సు…

1 min read

AABNEWS : మహిళల పోలీసులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, అప్పుడే వారు తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు, శుక్రవారం గూడూరు పట్టణంలోని కోనేటి మిట్ట వద్ద నున్న సి ఆర్ మార్ట్ లో గూడూరు డివిజన్ పరిధిలోని అన్నీ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న మహిళా పోలీసులకు చట్టాల పై అవగాహన సదస్సు గూడూరు డీఎస్పి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది, ఈ సదస్సులో డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ లు, ఎస్సై లు పాల్గున్నారు, ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆదేశాలు మేరకు గూడూరు డివిజన్ పరిధిలోని అన్నీ పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న
మహిళ పోలీసులకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించాం అనీ తెలిపారు. ఆడపిల్లలకు బతికే హక్కు, చదువుకునే హక్కు, ఉద్యోగం చేసే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని ఈ సందర్భంగా డిఎస్పి వివరించారు. నేడు అనేక మంది మహిళలు తమ హక్కుల గురించి తెలుసుకోలేక వాటికి దూరంగా ఉంటున్నారని అన్నారు. కరోనా(కోవిడ్19) లాంటి సమయంలోనూ చట్టాల గురించి తెలుసుకునేందుకు అనేక మంది మహిళ పోలీసులు సదస్సునకు రావడం అభినందనీయమని చెప్పారు. చట్టాలపై అవగాహన పెంచుకునేందుకు మహిళ పోలీసులు ఆసక్తి చూపుతున్నారని అనేందుకు ఈ కార్యక్రమం నిదర్శనమని అన్నారు. వివాహాలు, విడాకులు, ఆ తర్వాత భార్య పోషణ, ఆస్తిలో మహిళల హక్కులు, కార్మిక చట్టాలను వివరించారు. ప్రాథమిక హక్కులు, విధులు, అశ్లీలత, వరకట్న హత్యలు, యాసిడ్‌ దాడులు, కిడ్నాపులు, వేధింపులు తదితర వాటి నుంచి రక్షణ పొందేందుకు ఏర్పాటైన చట్టాలను మహిళా పోలీసులకు డిఎస్పీ వివరించారు. అదేవిధంగా ప్రాథమిక హక్కులను గురించి వివరించి, మహిళల చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. మహిళా మిత్రులు ఏర్పాటు చేసి వాటి విధి విధానాలు వారు చేయవలసిన కార్యక్రమాలు తోటి మహిళలకు కల్పించవలసిన రక్షణ గూర్చి క్షుణ్ణంగా వివరించారు. మహిళా మిత్రులు ఏర్పాటు చేసి ఎవరికి ఏ ఆపద వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారికి మహిళా మిత్ర సభ్యులు కూడా అండగా ఉండాలని సూచించారు. మహిళలు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా స్వేఛ్చా, సాధికారతలతో ఉన్నతంగా జీవించగలిగే ప్రశాంత పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత మనపై వుంది. బాలికలు, మహిళల భద్రతకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి అనుగుణంగా హోం మంత్రి శ్రీమతి మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో వినూత్న విధానాలకు పోలీసు వ్యవస్థ శ్రీకారం చుడుతున్నాము అని. అందులో భాగంగా బాలికలు, మహిళలను సైబర్‌ నేరాల నుండి కాపాడే రక్షణ కవచం ”సైబర్‌ మిత్ర” ఫేస్‌బుక్‌ పేజ్‌, 9121211100 వాట్సాప్‌ నెంబర్‌ను హోం మంత్రి చేతుల మీదుగా ఇటీవల కాలంలో ఆవిష్కరించడం జరిగింది అని ఆయన తెలిపారు. ఇది బాధితులు పోలీస్‌ స్టేషన్‌కు రాకుండానే తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకొని వచ్చే సులభతర సాంకేతిక విధానం. దీని ద్వారా బాధితుల వివరాలు గోప్యంగా వుండడమే కాకుండా వారికి సత్వరమే రక్షణ, న్యాయ సహాయం లభిస్తుంది. విధి నిర్వహణలో ఉన్న మహిళ పోలీసులు నిర్భయంగా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎవరూ అయిన ఆటంకం కలిగిస్తే వెంటనే సిఐ,ఎస్సై లకు సమాచారం అందించాలి అనీ సూచించారు, స్టేషన్ వచ్చే మహిళలు పట్ల గౌరవం చూపాలి అని కోరారు, అనంతరం సిఐ లు,ఎస్సై లు మహిళా పోలీసులకు పలు సలహాలు సూచనలు అందిస్తూ సుదీర్ఘంగా ప్రసంగించారు, ఈ అవగాహన సదస్సులో పట్టణ సిఐ దశరథ రామారావు, రూరల్ సి ఐ శ్రీనివాసులు రెడ్డి, వాకాడు సిఐ నరసింహ రావు, రూరల్ ఎస్సై పుల్లారావు, చిల్లకూరు ఎస్సై బాబీ,మనుబోలు ఎస్సై, పట్టణ ఎస్సై లు సైదులు,ఆదిలక్ష్మి ,అన్ని మండల పోలీస్ స్టేషన్ మహిళ పోలీసులు తదితరులు పాల్గొన్నారు,

 376 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.