AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

మిస్సింగ్ అయిన వివాహిత…

1 min read

AAB NEWS : నెల్లూరు జిల్లాలో వెంకటగిరి మిస్సింగ్ కేసు ముగిసిన కొద్దీ రోజుల్లోనే మనుబోలు లో మరో మిస్సింగ్ కేసు నమోదు కావడంతో మరలా సంచలంగా మారింది, గూడూరు డిఎస్పి రాజగోపాల్ రెడ్డి వెంకటగిరి కేసును ఛాలెంజ్ గా తీసుకుని ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు, మూడు రోజుల్లో మిస్సింగ్ కేసు కథ కు స్వస్తి చెప్పారు,ఇప్పుడు గూడూరు డివిజన్ పరిధిలోని మండల కేంద్రం అయిన మనుబోలు గ్రామం ఆర్ కె పురం కు చెందిన లోకేశ్వరి తన ఇద్దరు పిల్లలు ఏడు సంవత్సరాలు వయస్సు కలిగిన దివ్యశ్రీ, నాలుగు వయస్సు కలిగిన ధర్మ తేజ అను వారిని ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు మనుబోలు లోని మీ సేవా కేంద్రానికి వెళ్లి వస్తా ను అని ఇంటి వద్ద నుండి బయలుదేరి వెళ్ళింది, కానీ మరలా ఇంటికి ఆమె తిరిగి రాలేదు,దింతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది లోకేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు,బంధువుల ఇంటికి వెళ్లేందో ఏమో అనీ అక్కడ ఇక్కడ అని అన్ని ప్రాంతాలు తిరిగారు,చివరకు ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో సోమవారం కుటుంబ సభ్యులు మనుబోలు పోలీసు స్టేషన్లో మిస్సింగ్ కేసు ఇచ్చారు, పిర్యాదు స్వీకరించిన ఎస్సై రూరల్ సీఐ శ్రీనివాసులు రెడ్డి కి సమాచారం అందించారు, వెంటనే సిఐ ఆదేశాలు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు, మనుబోలు మిస్సింగ్ కేసు విషయం డిఎస్పి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు, ఇప్పుడు మరలా డిఎస్పి ఈ మిస్సింగ్ కేసును ఛాలెంజ్ గా తీసుకొని చేదిస్తారు అనీ ప్రజలు ఆశిస్తున్నారు,ఈ సందర్భంగా సీఐ శ్రీనివాసులు రెడ్డి ని వివరణ కోరగా మిస్సింగ్ అయిన లోకేశ్వరి భర్త కువైట్ లో ఉంటారు అనీ, లోకేశ్వరి ని ప్రతీ రోజు నెల్లూరు నుండి ఒక ఆటోలో వదిలి పెడతారు అనీ, అయితే ఆటో డ్రైవర్, లోకేశ్వరి సెల్ లు స్విచ్ అప్ అయి ఉన్నాయి అని,అందువలన అనుమానంతో లొకేషన్ కోసం ట్రెస్ చేస్తున్నాం అనీ తెలిపారు.

 144 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.