AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిర్ణయాలు…

1 min read

AABNEWS : రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీసేలా ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నిర్ణయాలు ఉన్నాయని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియా సోమవారం నెల్లూరు లో అమ్మ వడీ రెండో విడత కార్యక్రమా భారీ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గున్తున్న నేపథ్యంలో గూడూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో గూడూరు నియోజకవర్గ పరిధిలోని వందలాది వాహనాలలో వేలాదిమంది జనాభా ను తరలించారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపల్లి మాట్లాడుతూ, కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు ఎందుకు పెట్టాలో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు.. అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని  పేర్కొన్నారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని ప్రధాని మోదీనే ప్రకటించారని, ఏపీలో కూడా సీఎస్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి బొత్స చెప్పారు. ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ తెలియచేసిన గంట వ్యవధిలోనే షెడ్యూల్ విడుదల చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందన్నారు.‘‘2018లో పెట్టాల్సిన ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదు?. ఏపీలో 30 కేసులు కూడా లేనప్పుడు ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారు. కరోనా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్నారు. ప్రభుత్వాన్ని కాదని ఎన్నికలు జరుపుతామనడం నేనెప్పుడూ చూడలేదు. ఎవరి స్వార్థం కోసం ఎస్‌ఈసీ పనిచేస్తోందో అర్థం కావడం లేదు. కొద్దిరోజులు ఎన్నికలు వాయిదా వేస్తే వచ్చే ఇబ్బంది ఏంటి?. ఎస్‌ఈసీ ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోంది. ప్రజల ప్రాధాన్యతను ఎస్‌ఈసీ పట్టించుకోవడం లేదు. మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.. ఎన్నికలంటే భయపడటం లేదు.. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని’’ ఎమ్మెల్యే వెలగపల్లి పేర్కొన్నారు,ఈ కార్యక్రమంలో వైసీపీ నేత మెరిగ మురళి,కోడూరు మీరా రెడ్డి,మగ్దమ్ మొహిద్దీన్, బొమ్మిడి శ్రీనివాసులు, వెంకట సుబ్బారెడ్డి,వైసీపీ నేతలు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

 59 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.