AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతుకోసం-తెలుగుదేశం కార్యక్రమం…

1 min read

AABNEWS : గూడూరు రూరల్ మండల పరిధిలోని దివిపాలెం పంచాయతీ చవటపాలెం గ్రామం లోని రైతు భరోసా కేంద్రంను సందర్శించి నివార్, బురేవి తుఫాన్ వలన నష్ట పోయిన రైతులకు ఎంతమందికి నష్ట పరిహారం అందించారు, సబ్సిడీ లో ఏవేవి అందిస్తున్నారని అధికారులను అడిగిన…
శ్రీ పాశిం.సునీల్ కుమార్ గారు మాజీ శాసన సభ్యులు గూడూరు నియోజకవర్గం .మీడియాతో మాట్లాడుతూ మొన్న వచ్చిన నివార్, బురేవి తుఫాను వలన రైతులు పంటలు కోల్పోయారని , వారికి ఇంత వరకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించలేదు. ఈ నియోజకవర్గంలో ఎక్కువుగా పైర్లు, పెసలు, బొప్పాయి తదితర పంటలను,అక్వా సాగును రైతులు చాలా నష్టపోయారు. మొన్న జరిగిన అసెంబ్లీ లో నాయకుడు వెళ్లి పోడియం ముందర ఎందుకు కుర్చున్నారో రైతులు అందరూ అర్ధం చేసుకోవాలని, ఆ రోజు మా నాయకుడు అలా చేశారు కాబట్టే రాత్రికి రాత్రే పంటలకు భీమాను అందింస్తున్నామని ప్రభుత్వం ఉత్తర్వులు జారిచేసిందని, మా నాయకుడు రైతుల తరపున అడిగెంతవరకు ఈ ప్రభుత్వం రైతులకు ఎటువంటి భీమా సౌకర్యం వేసే ఉద్దేశ్యంలో లేదని, కాబట్టి ప్రజలు రైతులు కూడా అర్ధం చేసుకోవాలని ఎవరు ప్రజలు కోసం, రైతులకోసం పోరాడుతున్నారో అని, కాని మొన్న తుఫానులకు అధికార ముఖ్యమంత్రి గారు పై పైనే హెలికాప్టర్ లో తిరిగి జరిగిన నష్ట పరిహారం అంచనావేసి కొంచమే అందించారు. గతంలో ఈ జిల్లాలో వచ్చిన వరదలకు మా నాయకుడు శ్రీ నారా.చంద్ర బాబు నాయుడు గారు క్షేత్ర స్థాయిలో జిల్లా మొత్తం పర్యటించి వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, నష్ట పోయిన రైతులకు, కుటుంభాలకు వెంటనే నష్టపరిహారం అందించారు. గతంలో రైతు భరోసా/అన్నదాత సుఖీభవ లో బాగముగా మా నాయకుడు 15 వేలు ఒకే విడత లో అందించారు కాని ఇప్పుడు 12500 ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద 7500 -3 విడతులుగా అందిస్తుంది ఈ ప్రభుత్వం. గతంలో 2018-19 సంవత్సరంలో 1860 కోట్లు విడుదల చేసి సుమారు 30 లక్షల మంది రైతులకు పంట భీమ సౌకర్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రభుత్వం లో 56 లక్షల మందికి ఇస్తామని చెప్పి 26 లక్షల మందికే ప్రీమియం కట్టారు. దేశానికే వెన్నెముక అయినటువంటి రైతుకే ఈ ప్రభుత్వం సరిగా పంటల భీమా కాని , సబ్సిడీ లో విత్తనాలు కాని , ఏమి అందించడం లేదు. గతంలో మా నాయకుడు సబ్సిడీ లో రైతు రధాలు, స్ప్రేయర్లు, NTR జలసిరి పథకం కింద బోర్లను వేయించారు. నష్ట పోయిన రైతులకు 35 వేల రుపాయులు నష్టపరిహారం అందించాలని మేము తెలుగుదేశం పార్టీ తరపున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అద్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు రాజు, నియోజకవర్గ అధికార ప్రతినిధి T.ఇశ్రాయేల్ కుమార్,జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు.చెంచురామయ్య, మండల ప్రధాన కార్యదర్శి అమరేంద్ర, నాయకులు నరసరాజు,గోపాల్ నాయుడు, బాలకృష్ణా రెడ్డి, మల్లికార్జున్ నాయుడు,తూపిల్.సురేంద్ర, అలీ హుస్సేన్,పిల్లెల.శ్రీనివాసులు,చంద్రమౌళి,రవికుమార్,మురళి, శివప్రసాద్ గౌడ్,పర్వతాల సాయి కుమార్,వెంకట సాయి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 392 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.