రైతుకోసం-తెలుగుదేశం…
1 min read
AABNEWS : గూడూరు నియోజకవర్గం(తెలుగుదేశం పార్టీ) గూడూరు పట్టణం : రాష్ట్ర పార్టీ కార్యాలయ ఆదేశాల మేరకు రైతుకోసం-తెలుగుదేశం కార్యక్రమంలో బాగముగా మాజీ శాసన సభ్యులు
శ్రీ పాశిం.సునీల్ కుమార్ గారి పిలుపు మేరకు పట్టణ అధ్యక్షుల ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయం నందు నాయకులతో కలసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగ నాయకులు మాట్లాడుతూ ఈ అధికార ప్రభుత్వ హయాంలో 756 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటున్నారు , కానీ ఇంతమంది రైతుల ఆత్మహత్యలు కనబడట లేదా అని అన్నారు, మొన్న వర్షాలకు పంటలను రైతులు నష్టపోయారు, వారికె ఇంతవరకు నష్టపరిహారం సరిగా అందివ్వలేదు, నష్ట పోయిన పంటకు గిట్టు బాటు ధర ఇస్తామని చెప్పారు, గిట్టు బాట ధర ఇవ్వలేదు, పంట నష్టపోయిన రైతులుకు అండగా ఉంటామని చెప్పి , దళారులకు లాభం చేకూరేలా ఈ ప్రభుత్వం చేసింది. రైతన్న బాగు కోసం చేసిన వాగ్దానాలు మరిచిపోయి కనీసం వ్యవసాయ రంగానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితి నెలకొంది. గతంలో రైతు భరోసా/అన్నదాత సుఖీభవ లో బాగముగా మా నాయకుడు 15 వేలు ఒకే విడత లో అందించారు, కాని ఇప్పుడు 12500 ఇస్తామని చెప్పి రైతు భరోసా కింద 7500 -3 విడతులుగా అందిస్తుంది ఈ ప్రభుత్వం. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంభాలకు పరిహారం అందించాలని కోరుతున్నాం. అలాగే రైతుల తరపున తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షులు పులిమి.శ్రీనివాసులు, నియోజకవర్గ అధికార ప్రతినిధి T.ఇశ్రాయేల్ కుమార్, మండల నాయకులు నెలబల్లి.భాస్కర్ రెడ్డి,పట్టణ sc సెల్ అధ్యక్ష, కార్యదర్శులు కొణతం సురేష్, కుంచం మల్లిఖార్జున, పట్టణ BC సెల్ అధ్యక్ష, కార్యదర్శులు శివప్రసాద్ గౌడ్, దయాకర్, టీడీపీ జిల్లా నాయకులు నాయకులు కస్తూరి.గురవయ్య,పిల్లెల.శ్రీనివాసులు,పట్టణ మైనారిటీ సెల్ కార్యదర్శి అల్లి హుస్సేన్, నాయకులు చంద్రమౌళి,నారాయణ,వెంకటేశ్వర్లు,రవికుమార్,మురళి, పట్టణ యువత కార్యదర్శి పర్వతాల సాయి కుమార్,సద్దాం, వెంకట సాయి, , పాల్గొన్నారు.
178 Total Views, 4 Views Today