AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

రైతుల దీక్షను ప్రభుత్వం గౌరవించాలి…

1 min read

AABNEWS : సంవత్సర రోజుల అమరావతి రైతుల దీక్షను ప్రభుత్వం గౌరవించి అమరావతినే రాజధానిగా కొనసాగించాలి – మాజీ శాసన సభ్యులు గూడూరు నియోజకవర్గం(తెలుగుదేశం పార్టీ) దేశానికే వెన్నెముకైనటువంటి రైతులు రాష్ట్ర రాజధాని అమరావతి కోసం 365 రోజులుగా 3 రాజధానులు వద్దు అమరావతే ముద్దు అని దీక్షలు చేస్తున్న రైతులకు మద్ధతుగా పట్టణంలోని పార్టీ కార్యాలయం నందు నాయకులతో కలిసి సంఘీభావం తెలిపిన..
శ్రీ పాశిం.సునీల్ కుమార్ గారు
మాజీ శాసనసభ్యులు
జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ కింజరపు. అచ్చెన్నాయుడు గారి పిలుపుతో అమరావతి కోసం భూములు త్యాగం చేసి 365 రోజులుగా నిరసనలు చేస్తున్న అమరావతి రైతులకు మద్దతుగా వారికి సంఘీభావం తెలుపుతున్నాం అన్నారు. విభజన చట్ట ప్రకారం అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానంతో, ప్రధాని చేతుల మీదుగా ఆ రోజు నవ్యాంద్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా.చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతికి శంఖుస్థాపన చేశారు. ఏంతో మంది రైతులు తమ పొలాలను రాజధాని అమరావతి కొరకు ఇచ్చారు. 33 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు నిరసన చేస్తున్నా కూడా, ప్రభుత్వం అవేవి పట్టించుకోకుండా ప్రభుత్వం కాలాయపనం చేస్తుంది అన్నారు. అమరావతి లోనే రాజధాని నిర్మిస్తే తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందని అక్కసుతో ఈ రోజు అధికార ప్రభుత్వం ఇలాంటి చర్యలు చేస్తుంది అన్నారు. విభజన తరువాత మన రాష్ట్రానికి ఒక మెగాసిటీ లేదు,పరిశ్రమలు లేవు, ఆదాయం లేదు అలాంటి పరిస్థితులలో జిల్లాల వారీగా 13 జిల్లాలలో సహజవనరుల పరంగా చేయాల్సిన అభివృద్ధి పైనే మా నాయకుడు దృష్టి పెట్టారు.వాటినే ఆ రోజు అసెంబ్లీ లో ప్రకటించారు. 13 జిల్లాల గ్రోత్ స్ట్రాటజీ గురించి స్పష్టంగా వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ లో ఒక భాగమే అమరావతి అందుకోసమే అన్ని ప్రాంతాలకు సమదూరంలో నీటివనరులు కనెక్టివిటీ ఉన్న చోట ఫ్యూచర్ సిటీ గా ఆంద్రప్రదేశ్ కోసమే అమరావతి ని ఏర్పాటు చేశారు. ప్రజలు ఈ రోజు అధికార ప్రభుత్వం ప్రదర్సిస్తున్న ద్వంద వైకరిని గమనించాలని అన్నారు. రాష్ట్రానికి అమరావతే రాజధానిగా కొనసాగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షులు పులిమి.శ్రీనివాసరావు, తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం.శ్రావణి రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి నరసింహులు, మాజీ కౌన్సిలర్లు ఇశ్రాయేల్ కుమార్, సరస్వతమ్మ, రమణయ్య, భారతమ్మ,సుబ్బమ్మ,రాజ్యలక్ష్మమ్మ, నాయకులు నెలబల్లి.భాస్కర్ రెడ్డి, పట్టాభిరెడ్డి,దొడ్ల.నాగరాజు, వెంకటేశ్వర్లు నాయుడు,
చిన్నారావు,వెంకటేశ్వర్లు,పిల్లెల.శ్రీనివాసులు,ఎసుపాక.పెంచలయ్య,కస్తూరి.గురవయ్య,అలీ బాష, మల్లి, వేల్పుల రమేష్ కుమార్, కృష్ణయ్య,గూడూరు.శివ,శ్రీనివాసులు,రమేష్ నాయుడు, చంటి, నారాయణ,ప్రసాద్, యువత నాయకులు పర్వతాల.సాయి, పురిని.దయాకర్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.

 60 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.