AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

లోకేష్ యవ్వన జీవితం బుగ్గిపాలు…

1 min read

AAB NEWS :

అధికారి నిర్లక్ష్యంతో – యువకుడి జీవితం బ్రతుకు భారం

◼️లోకేష్ యవ్వన జీవితం బుగ్గిపాలు

◼️ తప్పు చేసి తప్పించున్న అధికారి..తప్పు ఎవరిది …ఎందుకు ఆ నిర్లక్ష్యం

◼️విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు భద్రత ఎక్కడ

◼️ కార్మికులు లేకుంటే .. లోకమే అంధకారం..

◼️ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న లోకేష్

◼️ అదుకోవాల్సిన అధికారులు చేతులెత్తేశారు

◼️ఇప్పుడు లోకేష్ పరిస్థితి ఏమిటి

◼️రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి,విద్యుత్ శాఖ అధికారులు అప్పన్న హస్తం ఇవ్వాలి

◼️ లోకేష్ కు ప్రాణం పోస్తాం అంటున్న దాతలు..

◼️ లోకేష్ ఆయుష్షు దాతల చేతుల్లో

◼️ స్పందించిన దాత ఆశ్రయా ఫౌండేషన్ ద్వారా 10 వేలు ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రన్నిల్

◼️ దాతలు మానవత్వం చూపాలి

◼️ లోకేష్ కు ప్రాణం పోయడంలో ప్రజా ప్రతినిధులు సాయం అందించాలి

◼️ చేయి చేయి కలుపుదాం ..లోకేష్ కు ప్రాణదానం చేద్దాం..

◼️ ఛిద్రం అయిన లోకేష్ జీవితానికి కొత్త రూపం ఇద్దాం…

◼️ గూడూరు దాతలు ముందుకు రావాలి

◼️ మానవత్వం చూపి లోకేష్ కు కొత్త జీవితం ఇవ్వాలి

◼️ఆదుకోవాలి అని లోకేష్ ఆయన తల్లి వేడుకోలు

మీజూరు మల్లి: ఒక బాధ్యత గల అధికారి హోదాలో ఉండి ఒక కార్మికుడు చేత బలవంతపు పనులు చేయించడం ద్వారా ఊహకు అందని ప్రమాదం సంభవించి ఒక యువకుడు యవ్వన జీవితం ఛిద్రం అయినా దినపరిస్థితి చుస్తే ఎవరికి అయినా మనస్సు చెలించక తప్పదు, అలాంటి దినపరిస్థితి గూడూరు నియోజకవర్గ పరిధిలోని చిల్లకూరు దళితవాడ యువకుడు లోకేష్ జీవితంలో చోటుచేసుకుంది.,

చలాకీగా ఉండే లోకేష్ పరిస్థితినేడుఅగోమ్యగోచరంగా మారి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ వైద్యం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి లోకేష్ దినపరిస్థితి పై స్పెషల్ స్టొరీ … గూడూరు నియోజకవర్గం చిల్లకూరు హరిజనవాడకు చెందిన లోకేష్ చిల్లకూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేరి పనిచేసుకుంటు తల్లిదండ్రులకు అండగా నిలిచి కుటుంబ పోషణకు దోహదపడుతూ ఉండేవాడు, లోకేష్ అందరితో చలాకీగా ఉంటూ విధులు నిర్వహిస్తు ఉండేవాడు ,

ఇలాంటి పరిస్థితుల్లో వీధికి కన్నుకుట్టిందో ఏమోకాని ఇటీవల కాలంలో ఒకనొక్క సమయంలో కరెంటు పోల్ లో చిన్న ఇబ్బంది ఏర్పడింది, ఆ సమయంలో లోకేష్ విధులు ముగించుకొని అలసిపోయి ఇంటిలో సేద తీరుతున్నాడు, ఆ సమయంలో విద్యుత్ శాఖ అధికారి రూపంలో మృత్యవు తపులు తట్టింది ఏమో కానీ వెంటనే విద్యుత్ శాఖ అధికారి లోకేష్ కు ఫోన్ చేసి సమస్యలు ఉన్నా కరెంట్ స్థంభం ఎక్కి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీచేశారు.

దింతో లోకేష్ స్పందిస్తూ సార్ ఇప్పటి వరకు పనిచేసి అలిసిపోయి ఇంటికి వచ్చాను కొంత సమయం తీసుకొని వెళతాను అనీ చెప్పడంతో ఆ అధికారికి కోపం వచ్చింది, అదిఅంత నాకు తెలియదు వెంటనే వెళ్లి కరెంట్ పోల్ ఎక్కి సమస్యను పరిష్కరించాలి అనీ హుక్కుమ్ జరిచేసి పోన్ పెట్టేశాడు, దింతో లోకేష్ చేసేది ఏమిలేక విధిలేని పరిస్థితి లో విద్యుత్ అధికారి బలవంత ఆదేశాలతో వెళ్లి కరెంట్ పోల్ ఎక్కి పని చేస్తూ ఉండగా ఉనట్లు ఉంది విద్యుత్ సప్లే రావడంతో లోకేష్ విద్యుత్ షాక్ కు గురై ఒళ్లంతా కాలిపోయి తీవ్ర గాయాలై ప్రమాదకర స్థితిలో ఉన్న లోకేష్ ను వెంటనే హాస్పటల్లో చేర్పించారు,అక్కడ ఛిద్రం అయిన పరిస్థితి లో వైద్యం అందుకొని ప్రాణాలతో బయటపడ్డారు, కానీ లోకేష్ రూపం మాత్రం పూర్తిగా అంద వికారంగా మారింది.

పేద కుటుంబానికి చెందిన లోకేష్ కు తండ్రి కూడా లేడు కేవలం అమాయకురాలు చదువు సంధ్య లేని తల్లి మాత్రమే ఉంది, ఆమె కూడా ఏ పనులు చేసుకోలేని పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ వైద్యానికి డబ్బులు లేక అప్పులు ఇచ్చే వారు లేక విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో లోకేష్ పరిస్థితి దయనీయంగా మారింది.

లోకేష్ పడుతున్న కష్టాలు తెలిసి కూడా విద్యుత్ అధికారి నాకు ఏమి తెలియదని తప్పించుకొని చేతులు ఎత్తి వేయడంతో, ఇటీవల కాలంలో ప్రజా సంఘాలు, లోకేష్ బంధువులు, లోకేష్ ని తీసుకొని విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు, అయినా కూడా లోకేష్ కి న్యాయం జరగలేదు.

దయనీయంగా లోకేష్ పరిస్థితి

ప్రాణ ప్రాయంతో కొట్టుమిట్టాడుతున్న లోకేష్
వైద్యానికి డబ్బులు లేకఇంటివద్దనే ఉంటూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ కాలం వెళ్లదీస్తూన్నాడు, ఇలాంటి పరిస్థితుల్లో దాతలు సహాయం చేసి లోకేష్ కు ప్రాణం పోయాలి అనీ లోకేష్ ఆయనతల్లివేడుకుంటున్నారు.ఆపదకాలంలో ఆపద్బాంధవులు దాతలు.ఎవరికి ఏ కష్టం వచ్చిన కుల మతలాకు వర్గ బేధాలకు, ప్రాంత భాషలకు అతీతంగా గూడూరు దాతలు వారికి తోచిన రీతిలో సహాయ సహకారాలు అందిస్తారూ, ఇప్పుడు లోకేష్ దిన పరిస్థితి తెలుసుకున్న గూడూరు దాతలు స్పందిస్తూ తమకు తోచిన రీతిలో లోకేష్ కు ఆర్ధిక సాయం అందిస్తూ లోకేష్ కు ప్రాణం పోస్తున్నారు,లోకేష్ దిన స్థితికి చెలించిన గూడూరు ఆశ్రయా ఫౌండేషన్ చైర్మన్ చంద్రన్నిల్ 10 వేల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించి తన దాతృత్వం చాటారు,ఈ నేపథ్యంలో నే గూడూరు దాతలు,ప్రజా ప్రతినిధులు స్పందించి లోకేష్ వైద్యం కొరకు సాయం చేసి లోకేష్ జీవితానికి ఆయుష్ పోయాలి అనీ చిల్లకూరు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు, దాతలు సాయం చేయాలంటే ఈ 9133640354 నంబర్ కి కాల్ చేయండి ఈ కల్లురూ లోకేష్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 32039567252 IFC SBIN 0014679 బ్యాంక్ అకౌంట్ నంబర్ కి విరాళాలు పంపి లోకేష్ కి న్యాయం చేయండి

 80 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.