AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ని అత్యంత మెజారిటీతో గెలిపించుకుందాం…

1 min read

AABNEWS : వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ని అత్యంత మెజారిటీతో గెలిపించుకుందాం. వైసీపీ మైనారిటీ విభాగం పిలుపు. ప్రచారం నిర్వహిస్తున్న వైసీపీ మైనారిటీ నాయకులు. గూడూరు:ఏప్రిల్ 17 న జరిగే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మద్దెల గురుమూర్తి ని గూడూరు నియోజకవర్గం నుండి అత్యంత భారీ మెజారిటీ తో గెలవాలని హజరత్ సయ్యద్ హాషిం హుస్సేనీ దర్గా లో సీనియర్ నాయకులు మేరిగ మురళి టెంకాయలు కొట్టి ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం దర్గా వీధి,నమాజు కట్ట వీధి, పి.ఎస్.ఆర్ పార్క్ వీధి,సత్రపు వీధి,DRW కాలేజ్ కట్ట నందు 150 మందితో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ రవూఫ్,రాష్ట్ర కార్యదర్శి మరియు గూడూరు మున్సిపాలిటీ ఎలక్షన్ ఇంచార్జి కో ఆర్డినేటర్ మగ్ధుమ్ మొహిద్దీన్,యువ నాయకులు షబ్బీర్,హాషిం,జీనత్ లు మాట్లాడుతూ నమ్మకానికి విశ్వసనీయత కు మారు పేరైన వైసీపీని ఆదరించాలని ఉప ఎన్నిక అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి ని భారీ మెజారిటీ తో గెలిపించాలని,ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంట ప్రజలంతా ఉన్నాము అనే సంకేతం ఢిల్లీ లో ఉన్న పాలకులకు తెలిసేలా అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మగ్ధుమ్,రవూఫ్, తిరుపతి పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.జలీల్, మైనారిటీ పట్టణ ప్రధాన కార్యదర్శియస్దాని, యువ నాయకులు షేక్.షబ్బీర్, హాషిం,మున్నా, జాకీర్ మహిళా నాయకురాలు జీనత్,హంషీద్ అలీ,జాహిద్,జరీనా,రెహమత్ తదితరులు పాల్గొన్నారు.

 1,547 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.