September 25, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

శ్రీమతి సావిత్రీభాయిపూలే గారి సేవలు చిరస్మరణీయం…

1 min read

AABNEWS : జనవరి 3 న మన భారతీయ సంఘ సంస్కర్త శ్రీమతి సావిత్రీభాయిపూలే గారి జయంతి సందర్బంగాడోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో శ్రీమతి సావిత్రీ భాయి పూలే గారి జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు.వారిని స్మరించుకున్నారు ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త పి.మహమ్మద్ రఫి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి తెలిపారు శ్రీమతి సావిత్రీబాయి ఫూలే గారు జనవరి 3 1831 న జన్మించారు. భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. ఆమె వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్తతో 1848 జనవరి 1నపూణేలోమొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కులకోసం పోరాటం చేయటం తమ సామాజికబాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేసారు. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో “సత్యాన్ని” శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి “సత్యశోధక్ సమాజ్ “ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు బలమైన ఉధ్యమం నడిపారు. కరువు వాతపడిన అనాథ బాలలను అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్త ప్రజల మనస్సున చిరస్మరనీయురాలిగా నిలిచారు. సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. సావిత్రిబాయి పూలే గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు చదువులోను, అవగాహనలోను, సమాజ సేవ లోను రాణించాలని సామాజిక కార్యకర్త డోన్
పి. మహమ్మద్ రఫి కోరారు.
మీ
పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త డోన్

 153 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.