November 28, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న జగన్ …

1 min read

AABNEWS :

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అని గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ వెలగపల్లి వరప్రసాద్ రావు వెల్లడించారు, శుక్రవారం
గూడూరు నియోజకవర్గ పరిధిలోనికోటమండలం,కోట ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రజల సౌక్యర్ధం రాష్ట్ర ప్రభుత్వంనూతనంగా ఏర్పాటు చేసిన ఏమిటో అనలైజర్, బయో కెమిస్ట్రీ అనలైజర్ డెంటల్ చేర్ పరికరాల ప్రారంభం కార్యక్రమంవైద్యఅధికారులు చేపట్టారు, ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగాగూడూరు శాసన సభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద రావు, కావాలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు పాల్గున్నీ పరికరాలు ప్రారంభించారు, అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు, ఎమ్మెల్యే వెలగపల్లిని, మాజీ ఎమ్మెల్యే బీద ను అధికారులు వైసీపీ నేతలు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగాగూడూరు శాసన సభ్యులు డాక్టర్ వెలగపల్లి వరప్రసాద రావు మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అని తెలిపారు. వైద్య శాఖను ప్రక్షాళన చెయ్యాలని, సామాన్యులకు కూడా వైద్యం అందుబాటులో ఉండాలని భావించిన ఏపీ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది అని,ఇక తాజాగా 2059 వ్యాధులకు చికిత్స అందించేందుకు నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం అందుకు పైలట్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టనుంది వెల్లడించారు.జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులను అందిస్తామని, తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా, హిమోఫిలియా, కిడ్నీ సమస్యలు ఉన్న డయాలసిస్ రోగులకు రూ.10వేల పెన్షన్లు ఇస్తామని సీఎం జగన్ చెప్పిన విషయం ఆయన గుర్తుచేశారు, బోదకాలు, వీల్ ఛైర్లకు పరిమితమైన బాధితులకు,తీవ్ర పక్షవాతంతో బాధపడేవారికి జనవరి నుంచి పెన్షన్లు ఇస్తామని పేర్కొన్న జగనన్న ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడుతున్నారు అని ఆయన పేర్కొన్నారు.జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు వేదికగా ఆరోగ్య శ్రీ పైలట్ ప్రాజెక్ట్ ను లాంచనంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు ఎమ్మెల్యే తెలిపారు,ప్రస్తుతం ఆరోగ్యశ్రీ ద్వారా 1,059 వ్యాధులకు వైద్య సేవలు అందుతున్నాయి అని అదనంగా మరో వెయ్యి వ్యాధులకు వైద్య సేవలు అందించేందుకు నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్ అన్నారు, దీంట్లో క్యాన్సర్ రోగులకు పూర్తిస్థాయిలో వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు, అందులో భాగంగానే పైలెట్‌ ప్రాజెక్టు‌ను ప్రభుత్వం ప్రారంభించింది అని ఆయన తెలిపారుఏప్రిల్ నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు ద్వారా మొత్తం 2059 వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది ఎమ్మెల్యే తెలిపారు,పైలెట్‌ ప్రాజెక్టు అమలుతో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి సర్కార్ వాటిని అధిగమించి మిగతా అన్ని జిల్లాలలోనూ ఏప్రిల్‌ నుంచి అమలు చెయ్యాలని భావిస్తోంది ఆయన వెల్లడించారు. ఇక ఈ నేపధ్యంలో వైద్య శాఖాధికారులతో మంత్రి ఆళ్ళ నానీ కూడా సమీక్ష నిర్వహించారు అని తెలిపారు.ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అందించే ఈ స్కీం కోసం ఆరోగ్య లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు అని ఎమ్మెల్యే వెలగపల్లి తెలిపారు,.ఎవరైనా లబ్ధిదారులు మిగిలిపోతే.. వారు ఎవరిని సంప్రదించాలి.. ఎవరికి దరఖాస్తు చేయాలన్న అంశాలను కూడా పొందుపరచాలని తెలిపారు. ప్రజల ఆరోగ్యరక్షణే ప్రధమ కర్తవ్యం అని భావించి సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఆర్ధిక భారం పెరుగుతున్నా సరే అమలు చేసి తీరతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్లు ఆయన తెలిపారు, ఈ కార్యక్రమంలో కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు,కోట మండల వైసీపీ కన్వీనర్ సంపత్ రెడ్డి, వైస్సార్సీపి పార్టీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి, ముస్లిం మైనారిటీల నాయకులు మోబీన్ బాషా, మరియు వైద్య అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

 1,169 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.