సేవా సంస్థ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం…
1 min read
AABNEWS : ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మొదటి వార్షికోత్సవం తేదిన శ్రీ చైతన్య స్కూలు ఆడిటోరియం నందు గొప్పగా నిర్వహించడమైనది. శ్రీ ఎద్దల నరేందర్ రెడ్డి పారిశ్రామిక వేత్త,అధ్యక్షులు పూర్తి సహాయ సహకారాలతో ప్రతి నెల నిరుపేదలకు పలసరుకులు, బియ్యం పంపిణీకార్యక్రమం సందర్భంగా ఈరోజు 20 మంది నిరుపేద కుటుంబాలకు 17 రకాల ఫల సరుకులు మరియు బియ్యం, శ్రీ నరేందర్ రెడ్డి గారి చేతుల మీదగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కడివేటి చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు.గౌరవ అతిథిగా పొనక మల్లికార్జున్ రెడ్డి గారు పాల్గొన్నారు .ఉపాధ్యక్షుడు వేమారెడ్డి సురేంద్ర నాథ్ రెడ్డి, సెక్రెటరీG. చంద్రశేఖర్,జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ కాటూరు ప్రగతి కుటుంబ సభ్యులు శ్రీనివాసులు,శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, గ్రానైట్ ప్రభాకర్, పి. డి. కరిముల్లా, ధనంజయ రెడ్డి, రామ్మోహన్, వాచ్ షాప్ రాము, పిల్లిల శీను, ఐటీఐ ప్రభాకర్, తనూజ్, ఆలీ, సుధీర్, కోఆర్డినేటర్ సతీష్, రమేష్(బ్యాకేరీ) తదితరులు పాల్గొన్నారు.
660 Total Views, 4 Views Today