AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

స్కార్పియోలో పేలిన ఏసీ గ్యాస్ సిలిండర్..

1 min read

AAB NEWS : స్కార్పియోలో పేలిన ఏసీ గ్యాస్ సిలిండర్
భారీ శబ్దంతో పేలిన స్కార్పియో..
పగిలిన చుట్టు పక్క నివాసాల ఇళ్ల కిటికీలు
ఫర్లాంగు దూరంలో పడిన కారు టైర్ రిమ్ములు.,
బాంబు పేలిందని భయభ్రాంతులకు గురైన స్థానికులు
తప్పిన పెను ప్రమాదం…
ఫోటో రైటప్స్ : 1. కారు ధ్వంసమైన దృశ్యం

  1. పరిశీలిస్తున్న ఎస్ఐ సైదులు
  2. పగిలిన కిటికీ అద్దాలు
  3. ఫర్లాంగు దూరంలో కారు టైరు రిమ్ములు
    విశాలాంధ్ర – గూడూరు :
    ,గూడూరు పట్టణంలోని సనత్ నగర్ ప్రాంతంలో నివాసముంటున్న కీర్తి హోండా షోరూం అధినేత ,సురేష్ కుమార్ రెడ్డి చెందిన స్కార్పియో వాహనం బుధవారం తెల్లవారుజామున 3-15 గంటలకు భారీ శబ్ధంతో పేలింది. దీంతో చుట్టుపక్కల నివాసం ఉంటున్న వారి కిటికీల గ్లాస్ డోర్స్ పగిలిపోయాయి. ఇళ్లలోని టీవీలు, ఎలక్ట్రిక్ వస్తువులు కాలిపోయాయి. ఈ సంఘటన పట్టణంలోని సనత్ నగర్ లో చోటుచేసుకుంది. తెల్లవారు జామున ఆ ప్రాంత ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ విస్ఫోటనం సంభవించింది. దీంతో స్థానిక ప్రాంత వాసులు గ్యాస్ సిలిండర్ పేలిపోయిందేమోనని అనుకున్నారు. సురేష్ రెడ్డి పక్కనే నివాసం ఉంటున్న ఆషికి ఇస్మాయిల్ బయటకొచ్చి పరిశీలించారు. స్కార్పియోలో పొగలు వస్తుండడంతో వెంటనే కారు యజమానిని అప్రమత్తం చేశారు. ముందు చక్రాలతోపాటు కారు బ్యానెట్ లోని ఇతర భాగాలు ముక్కలు ముక్కలై ఫర్లాంగు దూరంలో పడిపోయాయి. పేలిన శబ్దం చుట్టుపక్కల రెండు కిలో మీటర్ల వరకూ వినిపించింది. 500 మీటర్ల పరిధి వరకూ ఆ విస్ఫోటనానికి ఇళ్లు కంపించాయి. ఇదే సంఘటన పగటిపూట చోటుచేసుకుని ఉంటే పెను ప్రమాదం సంభవించి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవని చుట్టు పక్క ప్రాంతాల ప్రజలు అంటున్నారు. ఈ సంఘటనకు సంబంధించి కారు యజమాని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్ఐ సైదులు సంఘటనా స్థలానికి చేరుకుని ధ్వంసమైన కారును పరిశీలించారు. కారులో షార్ట్ సర్క్యూట్ అయితే కారు మొత్తం కాలిపోతుందని, అలాగే కారు డీజిల్ ఇంజన్ లో సమస్య ఉన్నా కాలిపోయే అవకాశం ఉంది. అయితే కారు ఐదడుగులు ఎత్తు ఎగిరే అవకాశం ఉండదని మెకానిక్ లు అంటున్నారు. బహుశా ఎవరైనా కారులో బాంబు పెట్టి ఉండవచ్చనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. టెక్నికల్ టీం పరిశీలన అనంతరం ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి అంత పెద్ద విస్ఫోటనం తర్వాత ఎటువంటి ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

 176 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.