హమ్ సేవలు స్ఫూర్తిదాయకం…
1 min read
AAB NEWS : హమ్ సేవలు స్ఫూర్తిదాయకం పట.టణ సీఐ జీ. దశరధరామారావు దుప్ఫట్లు, భోజనం పంపిణీ చేస్తున్న దృశ్యం హిందుస్థాన్ యునైటెడ్ ముస్లిమ్స్ సంస్థ సభ్యుల సేవలు స్ఫూర్తిదాయకమని పట్టణ సీఐ జీ. దశరధరామారావు అన్నారు. మంగళవారం హమ్ సంస్థ గూడూరు శాఖ అధ్యక్షులు షేక్. సద్దామ్ హుస్సేన్ ఆధ్వర్యంలో పూలతోట గిరిజన కాలనీలో నిరుపేదలకు దుప్పట్లం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమ్ సంస్ధ సభ్యులు పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. నివార్ తుపాన్, కరోనా విపత్తులలో హమ్ సంస్థ సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరొక అతిథి ఇన్సాఫ్ కమిటీ గూడూరు డివిజన్ అధ్యక్షులు షేక్ జమాలుల్లా మాట్లాడుతూ పట్టణంలౌ పదికి పైగా మైనారిటీ స్వచ్ఛంద సంస్థలు విపత్కర పరిస్థితులలో మేమున్నామంటూ ముందుకొచ్చి నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తున్నారన్నారు. హమ్ సంస్థ సభ్యులు విపత్తు సమయాలలో వేగంగా స్పందిస్తూ తమ వంతు సహకారం ఆందిస్తుండడం హర్షణీయమని కొనియాడారు. హమ్ సంస్థ అధ్యక్షుడు షేక్. సద్దామ్ హుస్సేన్ మాట్లాడుతూ సమాజంలో బాధ్యతాయుతంగా ఉంటూ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే దాతల సహకారంతో మున్ముందు మరిన్ని సేవా ఠార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తామన్నారు. ఆనంతరం సీఐ చేతుల మీదుగా దుప్పట్లు, భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. అంతకుముందు హమ్ సభ్యులు సీఐను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు షేక్ కబీర్, జమాలుల్లా, సయ్యద్, నయీముద్దీన్, హమ్ అధ్యక్షుడు సద్దామ్ హుస్సేన్, ఆదిల్ అహ్మద్, సమీర్, కలీమ్, జావీద్, సుబహాని, అమీర్, సాజిద్, ఏఐవైఎఫ్ పట్టణాధ్యక్షులు చల్లా వెంకటెశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

32 Total Views, 2 Views Today