AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

గొడవలైతే మాకు సంబంధం లేదు వకీల్ సాబ్ హెచ్చరిక…

1 min read

AABNEWS :  నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతుల ఖాతాల్లో వెంటనే రూ.10వేలు జమ చేయాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోపు నష్ట పరిహారం కింద ఎకరానికి రైతులకు రూ.35వేలు చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు తమకు సంబంధం లేదన్నారు. నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా కృష్ణా జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా గుడివాడలో పవన్ కళ్యాణ్ హాట్ హాట్ కామెంట్లు చేశారు.గుడివాడ నడిబొడ్డున నిలబడి చెబుతున్నా. అంతిమ శ్వాస వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి అండగా నిలబడతా. సినిమాలు చేస్తూ ఏం రాజకీయాలు చేస్తారని కొందరు మాట్లాడుతున్నారు. పేకాట క్లబులు నడిపి మీరు రాజకీయం చేయగా లేనిది నిజాయితీగా సినిమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు చేయకూడదా? సిమెంటు ఫ్యాక్టరీలు, మైనింగ్ సంస్థలు, మీడియా సంస్థలు నడిపి మీరు రాజకీయం చేస్తుంటే… సినిమాలు చేసుకుంటూ మేమెందుకు రాజకీయాలు చేయకూడదు? ఎంతసేపూ మీరంటున్న మాటలు పడుతూ, మీ కిందే ఊడిగం చేయాలా? ఆ రోజులు పోయాయి. ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. చొక్కా పట్టుకొని నిలదీసే రోజులివి జాగ్రత్తగా ఉండండి.’ అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.’సీఎం సాబ్‌కి చెబుతున్నా. ముందు రూ.10వేలు విడుదల చేయండి. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు రూ.35వేలు విడుదల చేయకపోతే మీరు అసెంబ్లీ ముట్టడికి సిద్ధం కండి. అక్కడ గొడవలు అవుతాయా? ఏం అవుతాయా? అక్కడ మీరు చూసుకోండి. మేం రాష్ట్రం నలుమూలల నుంచి రైతులను తీసుకొస్తాం. నిరుద్యోగంతో ఉన్న యువత కదలిరండి. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వరు. తేల్చుకుందాం. మనిషికో మాట. గొడ్డుకో దెబ్బ. అయ్యా, బాబూ అంటే మాన వినడం లేదు. అందుకే రోడ్డుమీదకు వస్తాం. అసెంబ్లీని ముట్టడిస్తాం. అందుకు రెడీగా ఉండండి.’ అని పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిక పంపారు.

 510 Total Views,  4 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.