గోడ పత్రికను ఆవిష్కరించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా…
1 min read
AABNEWS : పాపులర్ ఫ్రంట్ డే” గోడ పత్రికను ఆవిష్కరించిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్థానిక మన్సూర్ నగర్ లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా జిల్లా కార్యాలయంలో “దేశం కోసం పాపులర్ ఫ్రంట్ తో” నినాదంతో గల పాపులర్ ఫ్రంట్ డే గోడ పత్రిక ను పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నాయకులు ఆవిష్కరించారు. గోడ పత్రిక ఆవిష్కరణ చేసిన తర్వాత జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సయ్యద్ కాషిఫ్ మాట్లాడుతూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా దేశ ప్రజల సాధికారత కోసం 2007 న ఆవిర్భవించింది .దీనికి పూర్వం దక్షిణ నాలుగు రాష్ట్రాలలో వివిధ పేర్లతో సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుండేది. 2007 లో నాలుగు రాష్ట్రాలలో పని చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ప్రజల సహకారం తో అభివృద్ధి చెంది 23 రాష్ట్రాలలో పని చేయడం జరుగుతుంది. ఫిబ్రవరి 17 న అన్ని రాష్ట్రాలలో పాపులర్ ఫ్రంట్ పతాక ఆవిష్కరణ జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలలో యూనిట్ మార్చ్ నిర్వించి దేశప్రజల లో ధైర్యాన్ని నింపుతుంది మరియు దేశానికి పట్టి పీడిస్తున్న ,రాజ్యాంగ వ్యతిరేక శక్తులలో భయాందోళనలనం కల్గజేస్తుందని. ఆవిర్భావము నుంచి ఎన్నో అడంకులతో పోరాడి విజయ స్వరాలను మ్రొగిస్తు దేశ ప్రజల సాధికారత ,రక్షణ కోసం మరియు రాజ్యాంగ రక్షణ కోసం శ్రమిస్తున్న దేశ స్వచ్ఛంద సంస్థ అని . దేశానికి చీడ పురుగులుగా మారి రాజ్యంగాన్ని అంతం చేయాలని చూస్తున్న శక్తులు ఈ సంస్థ ను అడ్డుకోవాలని ,మూసివేయాలని చేస్తున్న కుట్రలు ఎప్పటికి నెరవేరదని తెలిపారు.
ఈ నెల మన సింహపురి లో జరిగిన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ మీట్ ను జయప్రదం చేసిన సెక్యులర్ ప్రజలందరికి పాపులర్ ఫ్రంట్ ధన్యవాదాలు తెల్పుతుందని జిల్లా కార్యదర్శి షేక్ ఇమామ్ బాషా తెలిపారు
771 Total Views, 4 Views Today