గౌ. భారత రాష్ట్రపతి గారికి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం రేణిగుంట
1 min read
AAB News : గౌ. భారత రాష్ట్రపతి గారికి రేణిగుంట విమానాశ్రయంలో ఘనస్వాగతం రేణిగుంట, నవంబర్ 24: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని, తిరుమల శ్రీవారిని దర్శనార్థం మంగళవారం ఉదయం 10.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న గౌ.భారత రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ వారికి ఘనస్వాగతం లభించింది. గౌ.రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి శ్రీ నారాయణస్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీపెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎపిఐఐసి ఛైర్మన్ శ్రీమతి రోజా, టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ శ్రీ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పార్లమెంట్ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి, శ్రీ రెడ్డెప్ప, శ్రీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి , శాసన సభ్యులు శ్రీ ఆదిమూలం, శ్రీ బియ్యపు మధుసూధన రెడ్డి, శ్రీ భూమన కరుణాకర రెడ్డి, శ్రీచింతల రామచంద్రా రెడ్డి, శ్రీ నవాజ్ బాషా , శ్రీ వెంకటే గౌడ, పెద్దిరెడ్డి ద్వారకానాధ రెడ్డి, శ్రీ జంగాలపల్లి శ్రీనివాసులు, శ్రీ బాబు , జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త, అడిషనల్ డిజిపిలు చంద్రశేఖర్ ఆజాద్, హరీష్ కుమార్, నగరపాలక కమిషనర్ గిరీషా, జెసి మార్కండేయులు, ఎపిడి సురేష్, సివిఎస్ ఓ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ కామాండెంట్ శుక్లా, తిరుపతి ఆర్బన్ ఎస్.పి.రమేష్ రెడ్డి, చిత్తూరు ఎస్.పి.సెంధిల్ కుమార్ , జెసి (సంక్షేమం) రాజశేఖర్ , డిఆర్ఓ మురళి, ఆర్డీఓ కనక నరసా రెడ్డి, బిజేపి నాయకులు భానుప్రకాష్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, సోమూవీర్రాజు, శాంతారెడ్డి, స్వాగతం పలుకగా విమానాశ్రయంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన తహశీల్దార్లు శివప్రసాద్ , ఉదయ్ సంతోష్, డిఎస్ పి లు గంగయ్య, చంద్రశేఖర్ లు పర్యటనలో వి వి పి ల లైజన అధికారులు తుడ సెక్రటరీ లక్ష్మి, సెట్విన్ సి ఈ ఓ మురళీకృష్ణ , తహశీల్దార్ సురేష్ బాబు, సిడిపిఓ శాంతి దుర్గా , రెవెన్యూ ,పోలీస్ అధికారులు, సిబ్బంది వున్నారు.గౌ.రాష్ట్ర గవర్నర్, గౌ.రాష్ట్రపతి వెంట తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి దర్శనానికి బయలుదేరారు. నేడు మధ్యాహ్నం 12 గంటలకు గౌ.భారత ప్రధాని నరేంద్రమోడీ గారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ఉన్నందున 11.15 గం. ముఖ్యమంత్రి గన్నవరం తిరుగు ప్రయాణం అయ్యారు.


146 Total Views, 8 Views Today