గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన…
1 min read
AAB NEWS : నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని పదికాలాల పాటు పదిలంగా ఉండేలా భవన నిర్మాణలు చేపట్టాలని మైలవరం శాసనసభ్యలు వసంత కృష్ణ ప్రసాదు గారు సూచించారు బుధవారం ఇబ్రహీంపట్నం మండలం తుమ్మలపాలెం గ్రామంలో రూ 40 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి స్థానిక నాయకులు అధికారులతో కలసి శంకుస్థాపన చేశారు
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు గారు మాట్లాడుతూ అభివృద్ది పనుల్లో పారదర్శకత పాటించి పనులు వేగవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు
186 Total Views, 2 Views Today