September 26, 2021

AABNEWS

AABNEWS covers Today’s Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం…

1 min read

AABNEWS : తిరువూరులో ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవం. MRPS ఉద్యమంలో అసువులు భాసిన అమరవీరులకు తిరువూరులో MRPS నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.స్థానిక రాజుపేటలో జరిగిన కార్యక్రమంలో అమరవీరుల చిత్ర పటాలకు పూలతో నివాళులు అర్పించారు.కార్యక్రమంలో MRPS తిరువూరు నియోజకవర్గ తాజా,మాజీ అధ్యక్షులు మారబత్తుల గోపాల్ మాదిగ మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో MRPS సామాజిక న్యాయమైన SC, వర్గీకరణ కోసం పోరాడుతుందని,ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసారని వారి త్యాగాలను ను స్మరిస్తూ ప్రతి సంవత్సరం మార్చి 1 వ తేదీ న మాదిగ అమరవీరుల దినోత్సవం జరపడం జరుగుతుందన్నారు.MRPS కేవలం మాదిగల కోసమే కాకుండా అన్ని వర్గాల పేదల కోసం పోరాడి ఎన్నో ఫలితాలు సాధించడం జరిగింది.సమాజంలో ఏ వర్గానికి అన్యాయం జరిగిన MRPS అండగా ఉంటుందన్నారు.కృష్ణ మాదిగ నాయకత్వంలో వర్గీకరణ సాధించి అమరుల ఆశయాలను సాధిస్తామన్నారు.కార్యక్రమంలో మండల అధ్యక్షులు కన్నెపొగు ప్రసన్న కుమార్ మాదిగ,చిలుకూరి చినరాములు, గొల్లందల శ్రీనివాస్ ,మోదుగు మోషే,వెంకటకృష్ణ,k కృష్ణ,దుబ్బాక రవి,తగరం కృష్ణ,తదితరులు పాల్గొన్నారు

 426 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News.