AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

చిత్తూరు జిల్లా అతలాకుతలం…

1 min read

AAB NEWS : చిత్తూర్‌ : నివర్‌ తుఫాన్ ప్రభావంతో గురువారం చిత్తూర్‌ జిల్లాలోని పలు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. వదమాలపేట మండలంతోపాటు ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, రేణిగుంట మండలాలు వర్షం ధాటికి చిగురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై చెరువులను తలపించాయి. రహదారులపై భారీగా వరద నీరు.

ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వర్షం కారణంగా ప్రాణనష్టమేమీ జరగలేదని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్‌ కే కన్నాబాబు తెలిపారు. తుఫాన్‌ ప్రభావంతో రాష్ట్రంలోని ఏడు జిల్లాలోని 96 మండలాల్లో భారీ వర్షం కురిసింది. 7,772 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నెల్లూర్‌, చిత్తూర్‌, ప్రకాశం, కడప, ప్రకాశం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 111 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. వర్షాల ధాటికి నెల్లూర్‌ జిల్లా ఇప్పటికే తీవ్రంగా ప్రభావితమైంది. తుఫాన్‌ తీరం ధాటి ఏపీలోకి ప్రవేశించడంతో ఇవాళ ఏపీలోని 200 మండలాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది.

 176 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.