చిత్తూరు జిల్లా నందు భారీ ఎత్తున ఎర్రచందనం…
1 min read
AAB NEWS : చిత్తూరు జిల్లా నందు భారీ ఎత్తున ఎర్రచందనం దుంగలు స్వాధీనం
8 మంది ఎర్రచందనం స్మగ్గ్లర్ లు అరెస్ట్ మరియు సుమారు 4 కోట్లు విలువైన 168 ఎర్రచందనం దుంగలు మరియు 60 లక్షలు విలువైన వాహనాలు స్వాధీనం.
చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్ పి శ్రీ ఎస్ సెంథిల్ కుమార్, ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ శ్రీ వై.రిషాంత్ రెడ్డి, ఐ.పి.ఎస్., గారి స్వీయ పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా నిరంతర వాహనాల తనిఖీలు, సమాచార సేకరణ జరుగుచున్నది. ఈ కార్యాచరణలో భాగంగా ఈ దినం 07-12-2020 వ తేదిన రాబడిన పక్కా సమాచారం మేరకు చిత్తూరు SDPO శ్రీ ఎన్.సుధాకర్ రెడ్డి మరియు SDPO పుత్తూరు శ్రీ T.D.యశ్వంత్ గారి అధ్వర్యంలో ఉదయం సుమారు 3 గం. ల సమయంలో పుత్తూరు ఇన్స్పెక్టర్ శ్రీ M.వెంకటరామి రెడ్డి, ఎస్.ఐ. వారి సిబ్బంది తడుకు ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా తిరుపతి నుంచి చెన్నై వైపు అతివేగంగా వెళ్తూ అనుమానాస్పదంగా వున్న ఈచర్ లారీని అపే ప్రయత్నం చేయగా లారి డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా ముందుకు పోనిచ్చాడు, లారీని వెంబండించి అదుపులో తీసుకోని తనిఖీ చేయగా అందులో 103 ఎర్రచందనం దుంగలను కనిపెట్టి 6 మంది స్మగ్లర్లను అదుపులో తీసుకోవడమైనది. చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 7 గం.ల ప్రాంతంలో కోడిగుట్ట క్రాస్, మురకంబట్టు, తిరుపతి బెంగుళూరు హైవే వద్ద తాలూకా ఎస్.ఐ శ్రీ విక్రం మరియు సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒక లారీని మరియు ఒక ఇన్నోవా నందు 65 ఎర్రచందనం దుంగలను కనుగొని స్వాధీనం చేసుకొని ఇద్దరు స్మగ్గ్లర్ లను అరెస్ట్ చేయడమైనది. స్వాధీనం చేసుకున్న 168 ఎర్రచందన దుంగలు మరియు వాహనాల విలువ 4 కోట్ల 60 లక్షల రూపాయలు, బరువు సుమారు 4 టన్నులు. ఈ విషయంపై పుత్తూరు మరియు చిత్తూరు తాలుకా పోలీసు స్టేషన్ నందు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుచున్నది. ముద్దాయిల వివరములు పుత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో :-ఆర్.బాల మురుగన్, వయస్సు 25 సం., s/o రవి, మారియమ్మన్ కోవిల్ వీధి, తిరుమంజాపురం గ్రామం, తిరువన్నామలై జిల్లా, తమిళనాడు. ఇతనిపై ఒక కేసు ఉన్నది. టి. గంగయ్య, వయస్సు 35 సం., s/o సదాశివయ్య, పుత్తూరు, చిత్తూరు జిల్లా. ఇతనిపై ఒక కేసు ఉన్నది. ఎం.దొరై రాజ్, వయస్సు 40 సం., s/o లేట్ సుబ్రహ్మణ్యం, కె.బి.ఆర్. పురం, పుత్తూరు మండలం, చిత్తూరు జిల్లా. ఇతని పై 3 కేసులు ఉన్నవి. కె.సుధాకర్, వయస్సు 30 సం., s/o రామ్మూర్తి, తొండం పట్టు గ్రామం, వరదయ్య పాలెం మండలం, చిత్తూరు జిల్లా. ఇతనిపై ఒక కేసు ఉన్నది. డి.నవీన్, వయస్సు 29 సం., s/o సుధాకర్ రెడ్డి, తొండం పట్టు గ్రామం, వరదయ్య పాలెం మండలం, చిత్తూరు జిల్లా. ఇతనిపై రెండు కేసులు ఉన్నవి.వై.రాజేష్, వయస్సు 29 సం., అంబికా పురం గ్రామం వరదయ్య పాలెం మండలం, చిత్తూరు జిల్లా. ఇతనిపై ఒక కేసు ఉన్నది. చిత్తూరు తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎం.అరవింద్ రెడ్డి, వయస్సు 34 సం., s/o ఎం.కేశవ రెడ్డి, రెడ్డివారి పల్లి, గట్టు పోస్ట్, బి.కొత్తకోట మండలం, చిత్తూరు జిల్లా. ఇతనిపై మూడు కేసులు ఉన్నవి. ఎన్.చంద్రబాబు, వయస్సు 29 సం., s/o ఎన్.మల్లికార్జున, రెడ్డి కాలనీ, మదనపల్లి టౌన్, చిత్తూరు
58 Total Views, 2 Views Today