AABNEWS

AABNEWS covers Today's Latest Online Telugu News, Andhra Pradesh (AP), Telangana, Political, Crime, Movies, Sports, National News and Google Web News.

జగన్ ప్రభుత్వం ముందంజలో ఉంది…

1 min read

AABNEWS : చిత్తూరు జిల్లా మదనపల్లెలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర విభజన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అప్పుల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారన్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రస్తుత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డిలు చేసిన అప్పుల్లో కేవలం 51%మాత్రమరే ఖర్చు పెట్టారన్నారు. కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం పబ్బం గడుపుకుంటున్నారని వాపోయారు. కేంద్రం ప్రవేశపెట్టిన స్వమిత్ర(ప్రాపర్టీ కార్ట్) పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు పత్రంగా పేరు మార్చి అమలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిస్ మస్ రోజున 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అవాస్తవమన్నారు. ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలుకు ఏడు వేల కోట్లు ఖర్చుచేశామంటున్న రాష్ట్ర ప్రభుత్వం, అందులో కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని, మిగిలిన మూడు వేల కోట్లు పక్కదారి మల్లాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 30వేల కోట్లనిధులను రాష్ట్రానికి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం చేతగానితనంతో 12 వేల కోట్ల సబ్సిడీ వెనక్కిపోయాయన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం22వేల కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. రాష్ట్రంలో అప్పులు, అవినీతి చేయడంలో ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం డబుల్ స్టిక్కర్ ప్రభుత్వం గా మారిపోయిందని, 108, 104 పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తే మోడీ బొమ్మ బదులు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం హాస్యాస్పదమన్నారు. గత టీడీపీ ప్రభుత్వం లో కేంద్ర ప్రభుత్వం mechanization కోసం ఎం ఎస్ ఎఫ్ డి సి నిధులు కేటాయిస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు బొమ్మ వేసుకొని థాంక్యూ సీఎం అని ప్రచారం చేసుకున్నారని, అప్పట్లో భారీగా అవినీతి జరిగిందన్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థిపై జనసేనతో చర్చిస్తున్నామని, త్వరలో ఒకరే పోటీ చేస్తారన్నారు.

 164 Total Views,  2 Views Today

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved AAB News. | Designed & Developed by AAB News. | Newsphere by AF themes.